'ఆపీ ఫిజ్' బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
రీల్ అయినా.. రియల్ లైఫ్‌లో అయినా నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూటే వేరు. కథలను ఎంచుకోవడంలోనూ.. బుల్లి తెరపైకి వచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపడంలోనూ మిగతా హీరోలతో పోలిస్తే జూనియర్ పూర్తి డిఫరెంట్. ఇలా బుల్లితెర, వెండితెరలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన అప్పుడప్పుడు 'బిగ్‌బాస్', ప్రకటనలతో మురిపిస్తుంటారు. ఇప్పటికే నవరత్న, సెలెక్ట్ మొబైల్స్‌తో పాటు పలు యాడ్స్లలో నటించిన జూనియర్ తాజాగా ‘ఆపీ ఫిజ్’ యాజమాన్యంతో భారీ ఒప్పందమే కుదుర్చుకున్నారు.
భారత ప్రూట్ డ్రింక్ అయిన ఆపీ ఫిజ్కి ప్రచారకర్తగా ఎన్టీఆర్‌ని నియమిస్తున్నట్లు సదరు యాజమాన్యం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అంటే ఇకపై దక్షీణాది రాష్ట్రాల్లో ఆపీ ఫిజ్‌కు అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ కొనసాగనున్నారన్న మాట. కాగా ఈ సంస్థకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం విదితమే. కాగా.. హైద్రబాద్ , చెన్నైలో కూడా దాని ఉత్పత్తులను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. అయితే దక్షీణాది రాష్ట్రాల్లో తమ హీరోలు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడం వల్ల తమ ఉత్పత్తులు మరింత ప్రాచుర్యం పొందుతాయని.. దీంతో దేశంలో నెంబర్ వన్ కంపెనీగా మారుతుందని కంపెని సీఎండీ నైదా చౌహన్ అశాభావాన్ని వ్యక్తం చేశారు. బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం పూర్తయిన తర్వాత జూనియర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.
నేను అమితంగా ప్రేమిస్తా..!
"నేను ఎప్పుడూ చురుగ్గా ఉండే ఫిజ్‌ని అమితంగా ప్రేమిస్తాను. బ్రాండ్ యొక్క విజన్,ప్లాన్లను చూసిన తర్వాత.. ఆ బ్రాండ్‌కు అంబాసిడర్ ఉండాలనే నిర్ణయం తీసుకున్నాను" అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
జూనియర్ ట్వీట్..
'అఫీ పిజ్' ఒప్పందం కుదుర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని తన ట్విట్టర్ వేదికగా జూనియర్ చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్‌కు నందమూరి అభిమానులు, ముఖ్యంగా జూనియర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్‌కు కామెంట్ల రూపంలో ‘ఆల్ ది బెస్ట్’.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments