Jr. NTR:ఫోటోగ్రాఫర్లపై మండిపడిన జూ.ఎన్టీఆర్.. వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
‘RRR’మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్‌టీఆర్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు తెలుగులో ‘దేవర’ మూవీతో బిజీగా ఉంటూనే మరోవైపు హిందీ మూవీ ‘వార్ 2’ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు. దీంతో ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ మూవీలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఈ మధ్య ఎక్కువగా ముంబైలో దర్శనిమస్తున్నాడు తారక్. తాజాగా 'వార్ 2’ ఘాటింగ్‌లో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన ఎన్టీఆర్.. ఫోటోగ్రాఫర్లపై ఫైర్ అవ్వడం చర్చనీయాంశమైంది.
సాధారణంగా ఎన్టీఆర్‌కు కోపం రాదు. ఎప్పుడూ తన ఫ్యాన్స్‌ను, కో స్టార్స్‌ను చిరునవ్వుతోనే పలకరిస్తాడు. కానీ తాజాగా ఫోటోగ్రాఫర్ల తీరుపై పూర్తిగా సహనం కోల్పోయాడు. ఫోన్‌లో మాట్లాడుతూ ముంబాయ్‌లోని ఒక హోటల్‌లోకి వెళ్తున్న తారక్‌ను చూడగానే ఫొటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్లు తన వెనక పరిగెత్తారు. దీంతో వారి ప్రవర్తనతో విసుగుపోయిన తారక్.. ఓయ్.. మర్యాదగా వెనక్కి వెళ్లండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఎన్‌టీఆర్.. ఫోటోగ్రాఫర్లపై కోప్పడ్డాడు అంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే తారక్ సినిమాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' చిత్రం ఇటీవల గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే ఫస్ట్ సింగల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోసర్లు, గ్లింప్స్ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. మరో సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారట. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. అందులో మొదటి భాగం 'దేవర పార్ట్-1' దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. అలాగే 'వార్2'తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీలోనూ నటించనున్నాడు.
Expecting Stunning Look From #War2 Movie 🔥🔥#ManofMassesNTR @tarak9999 pic.twitter.com/pQSXMwO1R4
— Jr NTR Fan Club (@JrNTRFC) April 25, 2024
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments