ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయింది: జేపీ నడ్డా
Send us your feedback to audioarticles@vaarta.com
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ అయితే టీఆర్ఎస్‌ను ఈ ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టేందుకు శతవిధాలా యత్నిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ అగ్ర నాయకత్వం కూడా వచ్చి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తోంది. దీనిలో భాగంగా నేడు(శుక్రవారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్‌షో నిర్వహించారు.
జోరు వర్షంలో కూడా జేపీ నడ్డా కొత్తపేట నుంచి నాగోల్ వరకూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఎన్నికల్లో తమ పార్టీకి మేయర్ పీఠం దక్కితే హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే ఇదే కేసీఆర్ పాలనకు ముగింపులా కనిపిస్తోందన్నారు. ప్రతి డివిజన్‌లోనూ కమలం జెండా రెపరెపలాడుతుందన్నారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని నడ్డా విమర్శించారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చకపోగా.. కొత్త హామీలతో ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నారని నడ్డా విమర్శించారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని.. ప్రజలు గ్రేటర్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. టీఆర్ఎస్ నేతల డ్రామాలు ఇక మీదట సాగవన్నారు. గల్లీ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ నేతలు వస్తున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నారని.. తమ పార్టీని గెలిపించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళతామన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout