చెప్పను బ్రదర్.. అంటూ జోకులు..

  • IndiaGlitz, [Tuesday,May 17 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స‌రైనోడు స‌క్సెస్ మీట్ లో మాట్లాడుతున్న‌ప్పుడు ...ప‌వ‌న్ గురించి మాట్లాడ‌మని అభిమానులు అడిగితే...ఏ ముహుర్తాన చెప్ప‌ను బ్ర‌ద‌ర్....అన్నాడో కానీ.. ఈ చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అనేది ఓ వైపు వివాద‌స్ప‌ద‌మైతే...మ‌రో వైపు జోకులు పేలుస్తుంది. బ‌న్ని చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటే ప‌వ‌న్ ఫ్యాన్స్ చూసుకుంటాం బ్ర‌ద‌ర్ అంటూ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. అయితే బ‌న్ని, ప‌వ‌న్ ఫ్యాన్స్ కాకుండా సాధార‌ణ జ‌నం కొన్ని సినిమాల డైలాగ్స్ తో లింక్ పెట్టి చెప్ప‌ను బ్ర‌ద‌ర్ పై జోకులు వేస్తున్నారు.
ఇంత‌కీ ఆ జోకులు ఏమిటంటే..
24 లో నా వాచ్ ఎక్క‌డ రా అని ఆత్రేయ్ అంటే శివ కుమార్ స‌మాధానం చెప్ప‌ను బ్ర‌ద‌ర్..
బాహుబ‌లి లో... శివుడు (ప్ర‌భాస్ ) నేను ఎన్న‌డూ చూడ‌ని క‌ళ్లు న‌న్ను దేవుడిలా చూస్తున్నాయి..నేను ఎవ‌ర్నీ..అని అంటే క‌ట్ట‌ప్ప స‌మాధానం చెప్ప‌ను బ్ర‌ద‌ర్..
క‌ట్ట‌ప్పా బాహుబ‌లిని ఎందుకు చంపావ్ అంటే క‌ట్ట‌ప్ప స‌మాధానం చెప్ప‌ను బ్ర‌ద‌ర్..
టెంప‌ర్ లో...నీ చుట్టూ వైఫ్ ఉంటుందా..అయితే పాస్ వ‌ర్డ్ చెప్పు అని ప్ర‌కాష్ రాజ్ అంటే...ఎన్టీఆర్ స‌మాధానం చెప్ప‌ను బ్ర‌ద‌ర్...
సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు లో పెద్దోడు (వెంక‌టేష్) పూల కుండీ ఎందుకు త‌న్నావ్ రా అంటే చిన్నోడు (మ‌హేష్ ) స‌మాధానం చెప్ప‌ను బ్ర‌ద‌ర్..
చైత‌న్య..అఖిల్ తో...సాహ‌సం శ్వాస‌గా సాగిపో, ప్రేమ‌మ్ నా రెండు చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మ‌రి నీ రెండో సినిమా ఎప్పుడు అంటే అఖిల్ స‌మాధానం చెప్ప‌ను బ్ర‌ద‌ర్...
ఇలా బ‌న్ని చెప్పిన చెప్ప‌ను బ్ర‌ద‌ర్..ఓ వైపు సీరియ‌స్ టాపిక్ అయితే మ‌రో వైపు న‌వ్వులు పూయిస్తుంది.