జీవితాన్నే కథగా చెబుతున్న ‘జోహార్’

  • IndiaGlitz, [Wednesday,July 29 2020]

గుండమ్మ కథలోని పాట రేడియో వినిపిస్తుంటుంది. ఓ తాత‌య్య‌ను పిల్ల‌లు క‌థ చెప్ప‌మ‌ని అడుగుతారు. దానికి ఆ తాత‌య్య బ‌దులిస్తూ.. ‘జీవితాన్నే కథగా చెబుతా వినండి అనడంతో ‘జోహార్’టీజర్ మొదలవుతుంది. ‘‘అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యానికి ప్రాణం పోసే పంచభూతాల్లాంటి ప్రజలు అని తాతయ్య కథను మొదలు పెడతాడు. ఓ అబ్బాయి అమ్మాయి మ‌ధ్య న‌డిచే ప్రేమ‌క‌థ‌, రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్ట‌యినా స‌రే! మా నాన్న విగ్ర‌హాన్ని క‌ట్టిస్తాన‌ని చెప్పే ఓ యువ రాజ‌కీయ నేత‌. ప‌రుగు పందెంలో గెల‌వాల‌నుకునే అమ్మాయి, భ‌ర్త లేని ఓ స్త్రీ ఇలా వీరి మ‌ధ్య న‌డిచే క‌థ‌కు రాజ‌కీయాల‌కు ఎలాంటి సంబంధం ఉంది’’ అనేది తెలియాలంటే మాత్రం ‘జోహార్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.

డిఫ‌రెంట్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ‘జోహార్‌’ సినిమా అతి త‌క్కువ కాలంలోనే తెలుగు ప్రేక్ష‌కులకు న‌చ్చిన‌, మెచ్చే కంటెంట్‌ను అందిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ’ఆహా’ ద్వారా ఆగ‌స్ట్ 14న విడుద‌ల‌వుతుంది. ఇప్ప‌టికే ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డిఫ‌రెంట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను అందించింది ‘ఆహా’. ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధ‌మైంది. మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ఈ చిత్ర టీజర్‌ను విడుద‌ల చేసి తేజ మార్ని, సందీప్ మార్ని సహా యూనిట్ స‌భ్యుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని, ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంద‌న్నారు వ‌రుణ్ తేజ్‌.

More News

అప్పుడు 16-17 గంటలు రోడ్లపైనే గడిపాను: సోనూసూద్

లాక్‌డౌన్ అనగానే ఎవరికి వాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవ్వరూ కూడా బయటకు రాలేదు. ఆ సమయంలో వలస కార్మికుల తిప్పలు వర్ణనాతీతం.

రావి కొండలరావు గారి బహుముఖ సేవలు అజరామరం: పవన్

ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

‘జోహార్’ టీజర్ విడుద‌ల చేసిన మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌

గుండమ్మ కథలోని పాట రేడియో వినిపిస్తుంటుంది. ఓ తాత‌య్య‌ను పిల్ల‌లు క‌థ చెప్ప‌మ‌ని అడుగుతారు.

సోనూసూద్ గురించి కోన వెంకట్ చెప్పిన విషయాలు వింటే షాకవుతారు..

ప్రముఖ నటుడు సోనూసూద్ గురించి ప్రముఖ దర్శకుడు, రచయిత కోనా వెంకట్ పలు ఆసక్తికర విషయాలు..

ఏపీలో నేడు 7,948 కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపీ కరోనా హెల్త్ బులిటెన్‌ను మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.