జోగేంద్ర యువగర్జన
Send us your feedback to audioarticles@vaarta.com
రానా దగ్గుబాటి హీరోగా తేజ దర్శకత్వంలో డి.రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నేనే రాజు నేనే మంత్రి`. కాజల్ అగర్వాల్, కేథరిన్ ట్రెసా నాయికలు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. డి. సురేశ్‌బాబు, ఎం.వి.కిరణ్ రెడ్డి, సి. భరత్ చౌదరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల, అభిరామ్ దగ్గుబాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. నవదీప్ కీలక పాత్రధారి. ఈ నెల 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోగేంద్ర యువగర్జన` కార్యక్రమం హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం జరిగింది. వెంకటేశ్ అభిమానుల సతీమణులు పూర్ణ ఆధ్వర్యంలో సుఖీభవ సాంగ్ లాంచ్ చేశారు.
వారిద్దరి ఫిలాసఫీలున్న సినిమా ఇది
రానా మాట్లాడుతూ .. సినిమాల పరంగా, వ్యక్తిగతంగా, జీవితపరంగా నందమూరి తారకరామారావుగారంటే నాకు దేవుడితో సమానం. ఈ సినిమాలో నేను చేసిన జోగేంద్ర పాత్రలో ఎన్టీఆర్‌గారి, ఎంజీఆర్‌గారి ఫిలాసఫీలుంటాయి. అందుకే ఈ సినిమా చేశా. ఈ సినిమా నాకు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన సినిమా. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా గురించి నేను చాలా గర్వంగా ఉన్నా. ఈ సినిమాను మా తాత చూడలేకపోయారనే లోటు ఉంది. ఈ రోజు ఈ వేదిక మీద నిలబడ్డామంటే ఆయన వల్లే. ఆయనతో సినిమా చేయలేదనే బాధ ఉండేది. నాకు తెలిసి ఆయన వెళ్లిపోయాక చాలా పాజిటివ్స్ జరుగుతున్నాయి. పైనుంచి ఆయనే సెట్ చేస్తున్నారని అనిపిస్తోంది. మా నాన్నతో ఫస్ట్ టైమ్ కలిసి చేశాం. మా నాన్న రియలీ గుడ్ ప్రొడ్యూసర్. సినిమా మీద తేజగారికున్న అవగాహన చాలా ఎక్కువ. ఇది జోగేంద్ర జీవిత చరిత్ర. అది రాయాలంటే జీవితంపై అవగాహన ఉండాలి. లేకుంటే రాయలేరు. వెంకటేశ్‌గారి అభిమానులు నాకు తోడు ఉన్నారన్న ధైర్యంతోనే నేను అన్నీ చేస్తున్నా. ఇదే సపోర్ట్ ఇస్తే హాలీవుడ్ సినిమా కూడా చేస్తాను. ప్రతి సినిమా చేస్తున్నప్పుడు కొత్తగా చేయాలని ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉండాలని అనుకుంటా. ఈ సినిమాలో చాలా సన్నగా కనిపిస్తాను. లావుగా కనిపిస్తాను. కండలు కూడా తిరిగి ఉంటాయి. త్వరలోనే యువత కోసం భారీ కార్యక్రమం చేస్తాం. ఈ నెల 11న విడుదల చేస్తాం`` అని తెలిపారు.
బాహుబలి అయిన తర్వాత ఈ కథని ఓకే చేశాం. కథలంటే నాకు మామూలుగా భయం, అదీ నా కొడుకుతో సినిమా అంటే చాలా భయం. రానా ఈ కథ విని సెట్ అవుతుందనుకున్నాడు. ఆ తర్వాత ఆ కథని చాలా బాగా తయారుచేశారు. రానాకి యాక్టింగ్ బాగా వస్తుందా? రాదా? అని కూడా ఆలోచించాను. రష్ చూసిన తర్వాత నిర్మాత కిరణ్ బావుందన్నారు. కేరక్టరైజేషన ఓరియంటడ్ పొలిటికల్ డ్రామా ఇది. కాజల్, రానా చాలా బాగా చేశారు. కేథరిన్ చాలా బాగా చేసింది. తేజ వాళ్లందరి చేత చాలా బాగా చేశారని డి.సురేష్ బాబు తెలిపారు. సురేష్ సంస్థంలో నాకు ఇది రెండో చిత్రం. రామానాయుడుగారి దగ్గర సినిమా గురించి చాలా నేర్చుకున్నా. ఇప్పుడు సురేశ్‌బాబుగారు, రానా దగ్గర కూడా సినిమా గురించే మాట్లాడుకుంటాం. రానాని చూసి చాలా నేర్చుకున్నాం. ఇందులో కథకి, జోగేంద్రకి సపోర్టింగ్ కేరక్టర్ చేశా. నా సినిమా కెరీర్ తేజ గారి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. మధ్యలో కొన్ని సినిమాలు చేసే స్టేజ్‌కి వెళ్లాయి. కానీ కుదరలేదు అని నవదీప్ చెప్పారు.
రానా గారికి కథ చెప్పగానే ఆయనకి నచ్చిందని చేశాం. రానా అంత పొడవుగా ఉన్న అమ్మాయి కావాలని కాజల్‌గారి దగ్గరకు వెళ్లాం. స్టైలిష్ కేరక్టర్ కోసం కేథరిన్‌ని తీసుకున్నాం. కొత్తోళ్లతో సినిమా చేసి బోర్ కొట్టిందని పాత వాళ్లతో తీశానని తేజ తెలిపారు. ఈ సినిమా నాకు స్పెషల్ సినిమా. రానాతో నాకు ఎంత పరిచయం ఉన్నా నాకు జోగేందర్‌గానే గుర్తుండిపోతాడు. సినిమాని ఎలా చూడాలో, ఎలా ప్రేమించాలో తేజగారి దగ్గర నేర్చుకున్నా. తేజగారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆయన నాకు గురువులాంటివారని కాజల్ అగర్వాల్ చెప్పారు. ఈ జోనర్ చిత్రం నేను చేయడం ఆనందంగా ఉంది. నన్ను పరిచయం చేసిన తేజగారితో నేను ఈ సినిమాకు పనిచేయడం హ్యాపీగా ఉంది. తేజగారు గూగుల్‌లాంటివారు. మ్యూజిక్‌లో కూడా తేజగారికి చాలా తెలుసు.ఈ చిత్రంలో పనిచేసినవారందరూ కొత్తగా కనిపిస్తారన్నారని అనూప్ అన్నారు. దేవికా రాణి పాత్ర చేయడం చాలా కొత్తగా ఉందని కేథరిన్ తెలుపగా, రానా- తేజ కాంబినేషన్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉందని భరత్ చౌదరి అన్నారు.
ఈ కార్యక్రమంలో తనికెళ్ళ భరణి, జయప్రకాశ్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, లక్ష్మీభూపాల్, వెంకట్, శివాజీరాజా తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పలువురు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com