అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ ఘన విజయం
- IndiaGlitz, [Sunday,November 08 2020]
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఘన విజయం సాధించారు. తుది ఫలితం పెన్సెల్వేనియాలో ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. పెన్సెల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. కాగా.. పెన్సిల్వేనియాలో జో బిడెన్ ఆధిక్యం కనబరిచారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై జో బిడెన్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లకు గాను.. జో బిడెన్‌కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు లభించాయి.
స్పష్టమైన మెజారిటీ జో బిడెన్‌కు లభించడంతో 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికయ్యారు. అంతేకాదు, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ఆసియన్ అమెరికన్‌గా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. నార్త్ కరోలినా ఫలితం తేలకపోవడంతో ట్రంప్‌కు ఇప్పటివరకూ 214 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే వచ్చాయి.