'బాహుబలి 2' కి కలిసొచ్చిన జియో
Friday, March 17, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న విజువల్ వండర్ బాహుబలి 2. . పార్ట్ 1 సాధించిన బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో బాహుబలి 2 చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోపే రెండు కోట్లకు పైగా వ్యూస్‌ను రాబట్టుకుని అందరినీ ఆశ్యర్యంలో పడేసింది.
అయితే ఈ సినిమా ట్రైలర్ బావుంది..ఇది ఎవరూ కాదనలేని నిజం. తెలుగువారుగా మనం అందరూ ఇది మన సినిమాగా చెప్పుకుని గర్వపడే సినిమా. అయితే ఈ ట్రైలర్‌కు ఇంత హ్యుజ్ రెస్పాన్స్ కోట్లల్లో వ్యూస్ రావడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే రిలయన్స్ జియో ఆఫర్. ఇంతకు బాహుబలి 2కు, జియోకు ఉన్న రిలేషన్ ఏంటని అనుకుంటున్నారా..అసలు సంగతిలోకి వెళితే..రిలయన్స్ కంపెనీ తను స్టార్ట్ చేసిన జియో అనే సిమ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన ఏకైక ఆయుధం ఇంటర్నెట్ డేటా ఫ్రీ...ఆల్ ఫ్రీ అనే నినాధంతో ప్రారంభమైన జియో సిమ్ కార్డ్స్‌ను ముందుగా జనం ఎగబడి తీసుకున్నారు. అందుకు కారణం ప్రజలకు ఖర్చు అయ్యేదేం లేదు ఒకటైతే అన్ లిమిటెడ్ డేటా ఫ్రీ అనే కాన్సెప్ట్. రిలయన్స్ జియో ఇచ్చిన ఆఫర్‌తో మిగతా కంపెనీలన్నీ బెంబేలెత్తాయి.
ఈ ఆఫర్‌తో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడూ జియో సిమ్‌ను ఉపయోగించడం మొదలు పెట్టారు. దీంతో ఇంటర్నెట్ ప్రతి ఒక్కడికి అందుబాటులోకి వచ్చింది. ఈ జియో ప్రయత్నంతో బాహుబలి2 ట్రైలర్‌ను అందరూ ఫోన్స్‌లోనే వీక్షించారు. భారీ రేంజ్‌లో ప్రేక్షకులు వీక్షకులుగా మారారు. ఎలాగైతేనేం జియో ఆఫర్ బాహుబలి 2 ట్రైలర్‌కు బంఫర్ ఆఫర్‌లా కలిసొచ్చిందన్నమాట...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments