జియో బంపరాఫర్.. సెప్టెంబర్ 5నుంచి ఫైబర్ సేవలు
Send us your feedback to audioarticles@vaarta.com
రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. జియో నుంచి నాలుగు రకాల బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 5న జియో ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖేష్ ప్రకటించారు. తద్వారా జియో హోం బ్రాడ్‌బ్యాండ్‌లో భాగంగా సెకనుకు 1జీబీ స్పీడ్‌తో 100 జీబీ ఇంటర్నెట్, ఉచిత ల్యాండ్‌లైన్ సౌకర్యం, వీడియో కాన్ఫరెన్స్, యూహెచ్‌డీ సెటాప్ బాక్స్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. 1600 నగరాల్లోని 2కోట్ల నివాసాలు, 1.5కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్‌ను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
జియోతో ఉపయోగమేంటి!?
జియో ఫైబర్ ద్వారా భారత్‌లోని ఏ టెలికాం ఆపరేటర్‌కైనా ఇంటి నుంచే ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఉచిత సేవలు జీవితకాలం ఉంటాయి.
ప్రారంభ ఆఫర్ కింద ఫరెవర్ వార్షిక ప్లాన్ తీసుకునే జియో ఫైబర్ కస్టమర్లు హెచ్‌డీ/ 4కే ఎల్‌ఈడీ టీవీ, సెట్‌టాప్ బాక్సును ఉచితంగా తీసుకోవచ్చు.
జియో నుంచి నెలకు రూ. 500తో అమెరికా, కెనడాకు అపరిమిత కాలింగ్ ప్యాకేజీ
ఇక గిగాఫైబర్ యాన్యువల్ ప్లాన్ తీసుకున్నవారికి హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీతో పాటు సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇస్తున్నాం.
యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే కేవలం ప్లాన్ ఛార్జీలు చెల్లిస్తే చాలు.
రిలయన్స్ జియో కోసం వేసిన ఫైబర్ తో భూమిని 11 సార్లు చుట్టి రావొచ్చు
34 కోట్ల మంది జియో కస్టమర్లతో తామే అగ్రగాములం
ప్రతి నెలా కోటి మంది జియో సభ్యత్వం పొందుతున్నారు.. భవిష్యత్ లో తమ సేవలను మరింత విస్తరిస్తామని ముఖేశ్ అంబానీ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments