‘జియో ఫైబర్’తో మాకెలాంటి నష్టం లేదు!
Send us your feedback to audioarticles@vaarta.com
జియో నెట్‌వర్క్‌తో రంగంలోకి దిగిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మిగిలిన టెలికాం సంస్థలను మట్టి కరిపించారు!. దీంతో విప్లవాత్మక మార్పులు రావడంతో పాటు.. పలు టెలికాం సంస్థలు మూతపడ్డాయి. అయితే ఈసారి ఏకంగా ‘జియో ఫైబర్’ అంటూ ఏకంగా ఇళ్లలోకే వచ్చేస్తున్నారు. జియో ఫైబర్ ప్రీమియం ద్వారా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్లాన్తో విడుదలైన రోజే ఇంట్లో కూర్చొని సినిమా చూసేందుకు అవకాశం కల్పించనున్నట్లు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు మీడియా ముందుకొచ్చి స్పందించాయి. జియో ఫైబర్ వచ్చినప్పటికీ తమకు తమ వ్యాపారాలు సజావుగానే సాగుతాయని దేశంలోని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఓ ప్రకటనలో స్పష్టం చేశాయి.
రెండు వేర్వేరు అనుభూతులంతే!
థియేటర్‌లో కూర్చొని సినిమా చూడటం, ఇంట్లో సినిమా చూడటం రెండు వేర్వేరు అనుభూతులు.. తమ సంస్థ దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ ‘పీవీఆర్’ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. సినిమా థియేటర్లను విస్తరించడం ద్వారా వ్యాపారాల్లో వృద్ధి ఉంటుందని దేశవ్యాప్తంగా తమకు మొత్తం 800 స్క్రీన్‌లు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపింది. సినిమా విడుదలైన.. 8 వారాల తర్వాతే ఇతర ప్లాట్ఫాంలలో(ఓటీటీ, టీవీల్లో) ప్రసారం చేయాలని తెలిపింది... ఇందుకు నిర్మాతలు, పంపిణీదారులు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు పరస్పరం అంగీకరించుకున్నాయనే విషయాన్ని ‘ఐనాక్స్’ సంస్థ ఈ సందర్భంగా గుర్తు చేసింది.
పీవీపీ ఏమన్నారంటే..
అంబానీ చేసిన ప్రకటన కచ్చితంగా సమూల మార్పులు తీసుకొస్తుందని నమ్ముతున్నానన్నారు. అయితే ఇది సినీ పరిశ్రమకు సరికొత్త సవాలునూ విసురుతోంది. సినీ పరిశ్రమ, కార్పొరేట్ సినిమాలు ఎలా తమను తాము మలుచుకోవాలో అర్థం చేసుకోగలనని అయితే.. సినిమాలు తీసేవాళ్లు.. ప్రాక్టికల్ సినిమాలు ఎక్కువగా తీయాలని.. జనాలు సినిమా హాల్‌లోనే ఆ సినిమాను ఆస్వాదించేలా నిర్మించాలని ఈ సందర్భంగా పీవీపీ పిలుపునిచ్చారు. ఇంట్లో కూర్చుని కొత్త చిత్రాలు చూడటమనే అనుభూతి కోసం భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన మీడియాకు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments