జూలై 24న వస్తున్న 'జిల్లా'
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో ఘన విజయం సాధించిన జిల్లా` చిత్రం అదే పేరుతో తెలుగులో ఈనె 24న విడుదలవుతోంది. విజయ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఓ ముఖ్య పాత్ర పోషించారు. సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి సమర్పణలో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్` పతాకంపై యువ నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్ సన్నితి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
నామన శంకర్రావు సహ నిర్మాత. డి. ఇమాన్ సంగీత సారధ్యంలో వెన్నెలకంటి సాహిత్యంతో రూపొందిన ఈ చిత్రం గీతాలు మధుర ఆడియో` ద్వారా విడుదలై ఉర్రూతలూగిస్తున్నాయి. ఈనెల 24న ఈ చిత్రం విడుదలవుతుండడాన్ని పురస్కరించుకొని ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి`ప్రసాద్ సన్నితి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ తెలుగు వెర్షన్ కోసం బ్రహ్మానందం, ఎల్.బి.శ్రీరాం, సురేఖావాణి తదితరులపై కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా చిత్రీకరించాం. ఈ చిత్ర హీరోహీరోయిన్లు విజయ్, కాజల్‌తోపాటు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన మోహన్‌లాల్, సంపత్, ప్రదీప్ రావత్, పూర్ణిమ భాగ్యరాజ్, మహత్ రాఘవేంద్ర, సూరి తదితరులంతా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు కావడం గమనార్హం. అందుకే.. ఈ సినిమాను చూసే ప్రేక్షకులంతా అచ్చమైన తెలుగు సినిమా చూస్తున్న అనుభూతికి లోనవుతారు. అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాం. ముఖ్యంగా.. ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి వంటి లెజండరీ ప్రొడ్యూసర్‌తో కలిసి నిర్మిస్తుండడం చాలా గర్వంగా ఉంది. ఇటీవ విడుదలైన ఆడియోకు చాలా మంచి ఆదరణ భిస్తోంది. తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 400కు పైగా ధియేటర్లలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments