ఆంధ్ర-తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో 'జిల్లా' - ఆర్.బి.చౌదరి
Send us your feedback to audioarticles@vaarta.com
స్విర్ జూబ్లీ (25 సంవత్సరాు) పూర్తి చేసుకొన్న సూపర్‌గుడ్ ఫిలింస్ నుంచి 85వ సినిమాగా రూపొంది, తమిళంలో 100 రోజులకుపైగా ప్రదర్శితమైన జిల్లా` తెలుగులోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఆడుతుండడం చాలా ఆనందంగా ఉందని, రేపటి నుంచి మరో పాతిక ధియేటర్లు పెంచుతున్నామని జిల్లా` సమర్పకులు, సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి అన్నారు. విజయ్-కాజల్-మోహన్‌లాల్-బ్రహ్మానందం ముఖ్య తారాగణంగా..
ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో రూపొందిన జిల్లా` అదే పేరుతో తెలుగులో ఈనెల 24న విడుదలై- హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని` సూపర్‌గుడ్ ఫిలింస్ కార్యాయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సక్సెస్‌మీట్‌లో చిత్ర సమర్పకులు ఆర్.బి.చౌదరి, చిత్ర నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి-ప్రసాద్ సన్నితి, చిత్ర దర్శకుడు ఆర్.టి.నేసన్ పాల్గొని తమ సంతోషాన్ని వెల్లడించారు. జిల్లా` చిత్రానికి ఘన విజయం అందిస్తున్న ఆంధ్ర- తెలంగాణ ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రకటించారు.
తమిళ సూపర్‌స్టార్ విజయ్‌కి తెలుగులో తొలి బ్లాక్‌బస్టర్‌గా జిల్లా` నివడం తమకు ఎంతో గర్వంగా ఉందని, తమిళంలో విజయ్ తమ సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్‌లో 6 చిత్రాల్లో నటించాడని, అన్నీ సూపర్ హిట్టేనని ఆర్.బి.చౌదరి అన్నారు.
ఆర్.బి.చౌదరిగారు వంటి లెజండరీ ప్రొడ్యూసర్‌తో కలిసి` శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తాము నిర్మించిన జిల్లా` డబ్బింగ్ సినిమా కేటగిరీలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి- ప్రసాద్ సన్నితి అన్నారు.
చౌదరిగారితో కలిసి త్వరలో ఓ స్ట్రయిట్ సినిమా ప్రొడ్యూస్ చేయనున్నామని వారు తెలిపారు. తమిళంలో జిల్లా` సాధించిన సంచలన విజయాన్ని తలపించేలా` తెలుగులో జిల్లా` రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతుండడం చాలా ఆనందంగా ఉందని చిత్ర దర్శకుడు ఆర్.టి.నేసన్ అన్నారు. టాలీవుడ్‌లోని పలువురు దర్శకులు జిల్లా` చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన ద్వారా వీక్షించి- తనకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతుండడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉందని దర్శకుడు ఆర్.టి.నేసన్ చెప్పారు!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com