జీవా, నయనతార నటించిన వీడే సరైనోడు సెప్టెంబర్ 6న విడుదల !

  • IndiaGlitz, [Saturday,August 31 2019]

జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో 'వీడే సరైనోడు' పేరుతో అనువదిస్తున్నారు. నోవా సినిమాస్‌ పతాకంపై కోకా శిరీష సమర్పణలో జక్కుల నాగేశ్వరావు అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రెస్ మీట్ లో నిర్మాత ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... చిన్న సినిమాలు ఏడాదికి 150 వరుకు వస్తుంటాయి. అందులో 30 వరకు డబ్బింగ్ సినిమాలో విడుదలవుతుంటాయి. ఈ డబ్బింగ్ సినిమాలు పెద్ద సినిమాలకు పిల్లర్స్ లాగా ఉంటాయి. ఈ సినిమా విజయం సాధించి నిర్మాత నాగేశ్వరరావు గారికి మంచి డబ్బు, పేరు సంపాదించి పెట్టాలని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి నటులు ఉన్నారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్న అన్నారు.

మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ... సినిమా విడుదలకు మంచి డేట్ కుదిరింది. నయనతార, జీవ నటన సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. నిర్మాత నాగేశ్వర్ రావ్ గారికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను అన్నారు.

నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఈ సినిమా కోసం నాకు సహాయ పడిన వారందరికీ ధన్యవాదాలు. ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపట్ల ఈ సినిమాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, వారికి స్పెషల్ థాంక్స్. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజయం సాధిస్తుండని అందుకు అందరి సహకారం కావాలని కోరారు.

నటీనటులు: జీవా, నయనతార

More News

'మిస్టర్ రావణ' ప్రారంభం

మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్  బాలీవుడ్ స్టార్ నటుడు అనూప్ సింగ్ ఠాగూర్ టైటిల్ పాత్రలో  "మిస్టర్ రావణ"

బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ ఉండదా?

బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పటిలాగే తన ఫన్ తో నవ్వులు పూయించారు బాబా మాష్టారు.

అభిమానులు, స్నేహితులు.. ఆందోళన వద్దు: రానా

రానా దగ్గుబాటి... తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

చిరంజీవికి పెను ప్ర‌మాదం త‌ప్పిందా?

మెగాస్టార్ చిరంజీవికి పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని మీడియా వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. చిరంజీవి వ్య‌క్తిగ‌త ప‌నిపై ముంబై వెళ్లారు.

మంత్రి బొత్స మాటలు.. మాజీ మంత్రికి అర్థం కాలేదట

ఏపీ రాజధాని తరలింపుపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని రైతుల్లో ఆందోళన రేపాయి.