జ్యోతిక చిత్రం వ‌చ్చేస్తుందిగా!!

  • IndiaGlitz, [Monday,October 29 2018]

హీరో సూర్య‌ను పెళ్లి చేసుకుని సినిమాల నుండి తాత్కాలికంగా గ్యాప్ తీసుకున్న జ్యోతిక ఇప్పుడుసినిమాల్లో న‌టిస్తుంది. 36 వ‌య‌దినిలే, మ‌గ‌లిర్ మ‌ట్రుమ్‌, నాచియార్ చిత్రాల్లో న‌టించిన జ్యోతిక హిందీలో విద్యాబాల‌న్ న‌టించిన 'తుమ్హారీ సులు' చిత్రాన్ని 'కాట్రిన్ మొళి' పేరుతో త‌మిళంలో రీమేక్ చేసింది.

రాధామోహ‌న్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ 'వ‌డ‌చెన్నై, సండై కోళి2(పందెంకోడి 2)' కార‌ణంగా విడుద‌ల చేయ‌లేదు. తాజాగా ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 16న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు.