తిరుపతిలో పెళ్లి చేసుకుంటానన్న జాన్వీ
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత తార శ్రీదేవి దూరమైందన్న బాధలో ఉన్న అభిమానులు ఆమెను జాన్వీకపూర్‌లో చూసుకుంటున్నారు. `దఢక్` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కార్గిల్ గర్ల్ చిత్రంతో పాటు తక్త్ చిత్రంలోనూ నటిస్తుంది. మంచి పాపులారిటీని సంపాదించుకుంటున్న జాన్వీకపూర్ ఓ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి గురించి ప్రస్తావించింది. శ్రీదేవి మీ పెళ్లి గురించి ఎప్పుడైనా మాట్లాడేవారా? అంటే `` కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. అయితే నేను ఎదుటి వ్యక్తిని తొందరగానే నమ్మేస్తాను. కాబట్టి ప్రేమ విషయంలో నేను ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటానోనని అమ్మ భావించేది. అందువల్ల తానే ఓ మంచి అబ్బాయిని చూస్తానంది`` అన్నారు.
కాబోయే ఎలా ఉండాలనుకుంటారు అని అడిగే జాన్వీ మాట్లాడుతూ ``చాలా నైపుణ్యం ఉన్నవాడై ఉండాలి. తన వృతిపట్ల నిబద్దత, అంకితభావం ఉన్నవాడై ఉండాలి. సెన్సాఫ్ హ్యుమర్ ఉండాలి. అతని దగ్గర నుండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి నేను ఆసక్తిని చూపించేంత పరిజ్ఞానం ఉండాలి`` అన్నారు.
మరి పెళ్లి గ్రాండ్‌గా ఎక్కడ చేసుకుంటారని ప్రశ్నిస్తే ఆమెమాట్లాడుతూ ``నేను గ్రాండ్ సెలబ్రేషన్స్‌కు చాలా దూరంగా ఉంటాను. నేను ఎక్కువ ఫ్యాన్సీగా ఉండటానికి ఇష్టపడను. నాకు నేనులా అనిపించాలనుకుంటాను. నేను నా పెళ్లిని సింపుల్‌గా సంప్రదాయబద్దంగా తిరుపతిలో చేసుకుంటాను. కంచిపట్టు జరీ కట్టుకుంటాను. పెళ్లి తర్వాత దక్షిణాది వంటకాలైన ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం, ఖీర్ తదితర వంటకాలతో బోజనాలు కూడా ఉంటాయి`` అంటూ ఏమాత్రం తడుముకోకుండా చెప్పేసింది. జాన్వీకపూర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments