తిరుప‌తిలో పెళ్లి చేసుకుంటాన‌న్న జాన్వీ

  • IndiaGlitz, [Monday,September 09 2019]

దివంగ‌త తార శ్రీదేవి దూర‌మైంద‌న్న బాధ‌లో ఉన్న అభిమానులు ఆమెను జాన్వీక‌పూర్‌లో చూసుకుంటున్నారు. 'ద‌ఢ‌క్‌' చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన జాన్వీ మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కార్గిల్ గ‌ర్ల్ చిత్రంతో పాటు త‌క్త్ చిత్రంలోనూ న‌టిస్తుంది. మంచి పాపులారిటీని సంపాదించుకుంటున్న జాన్వీక‌పూర్ ఓ మేగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న పెళ్లి గురించి ప్ర‌స్తావించింది. శ్రీదేవి మీ పెళ్లి గురించి ఎప్పుడైనా మాట్లాడేవారా? అంటే '' కొన్ని సంద‌ర్భాల్లో మాట్లాడారు. అయితే నేను ఎదుటి వ్య‌క్తిని తొంద‌ర‌గానే న‌మ్మేస్తాను. కాబ‌ట్టి ప్రేమ విష‌యంలో నేను ఎలాంటి వ్య‌క్తిని ఎన్నుకుంటానోన‌ని అమ్మ భావించేది. అందువ‌ల్ల తానే ఓ మంచి అబ్బాయిని చూస్తానంది'' అన్నారు.

కాబోయే ఎలా ఉండాల‌నుకుంటారు అని అడిగే జాన్వీ మాట్లాడుతూ ''చాలా నైపుణ్యం ఉన్న‌వాడై ఉండాలి. త‌న వృతిప‌ట్ల నిబ‌ద్ద‌త‌, అంకిత‌భావం ఉన్న‌వాడై ఉండాలి. సెన్సాఫ్ హ్యుమ‌ర్ ఉండాలి. అత‌ని ద‌గ్గ‌ర నుండి కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డానికి నేను ఆస‌క్తిని చూపించేంత ప‌రిజ్ఞానం ఉండాలి'' అన్నారు.

మ‌రి పెళ్లి గ్రాండ్‌గా ఎక్క‌డ చేసుకుంటార‌ని ప్ర‌శ్నిస్తే ఆమెమాట్లాడుతూ ''నేను గ్రాండ్ సెల‌బ్రేష‌న్స్‌కు చాలా దూరంగా ఉంటాను. నేను ఎక్కువ ఫ్యాన్సీగా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌ను. నాకు నేనులా అనిపించాల‌నుకుంటాను. నేను నా పెళ్లిని సింపుల్‌గా సంప్ర‌దాయ‌బ‌ద్దంగా తిరుప‌తిలో చేసుకుంటాను. కంచిప‌ట్టు జరీ క‌ట్టుకుంటాను. పెళ్లి త‌ర్వాత ద‌క్షిణాది వంట‌కాలైన ఇడ్లీ, సాంబార్‌, పెరుగన్నం, ఖీర్ త‌దిత‌ర వంట‌కాల‌తో బోజ‌నాలు కూడా ఉంటాయి'' అంటూ ఏమాత్రం త‌డుముకోకుండా చెప్పేసింది. జాన్వీక‌పూర్‌.

More News

నిజ‌మైన మెగాస్టార్‌ను చూశానంటున్ను చెర్రీ

మెగాస్టార్ చిరంజీవితో ఎవ‌రికైనా సినిమా చేయాల‌నుంటుంది. అది ద‌ర్శ‌కుడైనా కావ‌చ్చు.. నిర్మాతైనా కావ‌చ్చు.

అక్టోబర్‌లో సెట్స్‌పైకి రాజశేఖర్‌ కొత్త సినిమా

యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ కథానాయకుడిగా క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ పతాకంపై జి. ధనుంజయన్‌ ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

వాల్మీకి ట్రైలర్ రిలీజ్

నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే సస్తరు..', 'మనం బతుకుతున్నమని పదిమందికి తెల్వకపోతే.. ఇగ బతుకుడెందుకురా..'

బీజేపీలోకి ఊహించని నేత.. కమలనాథులతో చర్చలు!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలక నేతలు,

హీరో కార్తికేయ కొత్త చిత్రం '90 ఎంఎల్‌'

`ఆర్‌.ఎక్స్.100` సినిమా టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఝుమ్‌... ఝుమ్మంటూ సంద‌డి చేసింది.