ద‌క్షిణాది సినిమాల‌ పై జాన్వీ షాకింగ్ కామెంట్స్‌

  • IndiaGlitz, [Wednesday,October 03 2018]

అల‌నాటి అందాల తార.. అభిన‌య తార శ్రీదేవి కుమార్తె.. జాన్వీ క‌పూర్ 'ద‌ఢ‌క్' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్న జాన్వీ ఇప్పుడు క‌ర‌ణ్‌జోహార్ త‌క్త్ చిత్రంలో న‌టిస్తుంది.

కాగా కొన్ని రోజుల ముందు ఈమె రెండు త‌మిళ సినిమాలు.. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోఓ చిత్రంలో న‌టించ‌నుంద‌నే వార్త‌లు వినిపించాయి. ఈ వార్త‌ల‌పై ప్ర‌స్తుతానికి 'ద‌ఢ‌క్' సినిమా న‌టిగా మంచి గుర్తింపును తెచ్చింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో మంచి సినిమాలు చేయాల‌నుకుంటున్నాను.

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించిన త‌ర్వాతనే ద‌క్షిణాది సినిమాల్లో న‌టిస్తాను. ఇప్ప‌ట్లో ద‌క్షిణాది సినిమాల్లో న‌టించ‌ను అంటూ చెప్పేసింది జాన్వీ క‌పూర్‌. దీంతో జాన్వీ సౌత్ ఎంట్రీపై వినిపిస్తున్న వార్త‌లకు బ్రేకులు ప‌డ్డ‌ట్లు అయ్యాయి.