'కార్గిల్ గ‌ర్ల్' అంటున్న జాన్వి

  • IndiaGlitz, [Tuesday,February 26 2019]

గ‌త ఏడాది 'ద‌ఢ‌క్‌' చిత్రంతో తెరంగేట్రం చేసిన శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ .. న‌టిగా మంచి మార్కుల‌ను సంపాదించుకుంది. అయితే ఏదో త్వ‌ర‌త్వ‌ర‌గా సినిమాలు చేసేయాల‌నే ఉద్దేశంతో కాకుండా ఓ ప్లానింగ్‌తో సినిమాల‌ను ఎంపిక చేసుకుంటుంది జాన్వి. రెండో సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ సినిమా వైపు, గ్లామ‌ర్ సినిమా వైపో మొగ్గు చూప‌కుండా బ‌యోపిక్ చేయ‌డానికి సిద్ధ‌మై అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంది.

కార్గిల్ యుద్ద స‌మ‌యంలో సైనికుల‌ వైద్య సేవ‌ల కోసం వ‌ర్క్‌చేసిన ఎయిర్ ఫోర్స్ లేడీ ఆఫీస‌ర్ గుంజ‌న్ స‌క్సేనా జీవిత‌క‌థ‌ను సినిమాగా తీసుకున్నారు. రీసెంట్‌గా ల‌క్నోలో చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైన ఈ చిత్రానికి కార్గిల్ గ‌ర్ల్ అనే టైటిల్‌ను పెట్టార‌ట‌. శ‌ర‌ణ్ శ‌ర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పంక‌జ్‌క‌పూర్‌, అంగ‌ద్ బేడి కీల‌క పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు.