'జ్యువెల్ థీఫ్' నవంబర్ 8న థియేటర్లలో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సెన్సార్ బోర్డు ప్రశంసలతో ‘జ్యువెల్ థీఫ్ - Beware of Burglar’ చిత్రంపై అంచనాలు మరింతా పెరిగాయని నిర్మాత మల్లెల ప్రభాకర్ చెప్పారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిందని, నవంబర్ 8న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మూవీ బాగా వచ్చిందని, కథ, స్క్రీన్ ప్లే, ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ తమ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయని చెప్పారు.
ఇటీవలే రిలీజైన ట్రైలర్, ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. హీరో కృష్ణసాయి బాగా నటించారని, ఈ సినిమాతో ఆయనకు ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ వస్తుందని చెప్పారు. ఆయనతో పాటు సీనియర్ నటీనటులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి బాగా నటించారని, ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో నచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది అని చెప్పారు. ‘జ్యువెల్ థీఫ్’ ప్రతి ఒక్కరు థియేటర్లో ‘జ్యువెల్ థీఫ్’ సినిమా చూసి మా టీమ్‌ను సపోర్ట్ చెయ్యాలని అన్నారు.
కృష్ణసాయి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. Beware of Burglar అనేది సబ్ టైటిల్. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు.
ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యాంకాక్ లో పాటలను గ్రాండ్‌గా చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ కు అనూహ్య స్పందన వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణకు అభిమాని అయిన హీరో కృష్ణసాయి డాన్స్, మేనరిజమ్స్, హెయిర్ స్టైల్ అభిమాన హీరోను గుర్తు చేస్తుండటం విశేషం.
పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సినిమాను నవంబర్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటీనటులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com