'జెస్సీ' విడుదలకు సిద్ధం
Send us your feedback to audioarticles@vaarta.com
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ `జెస్సీ`. ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ ప్రై.లి. బ్యానర్‌పై వి.అశ్విని కుమార్ దర్శకత్వంలో శ్వేతా సింగ్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 15న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
నిర్మాత శ్వేతా సింగ్ మాట్లాడుతూ - ``సినిమా మార్చి 15న విడుదలవుతుంది. పి.వి.ఆర్ సినిమాస్ ద్వారా సినిమా విడుదలవుతుంది. వంశీ కాకా చాలా సపోర్ట్ చేశారు`` అన్నారు.
ఆషిమా నర్వాల్ మాట్లాడుతూ - ``ఈ సినిమా చేసి రెండేళ్లు అవుతుంది. అప్పటికీ.. ఇప్పటికీ చాలా మంది మారిపోయారు. ఇది నా మొదటి సినిమాగా విడుదల కావాల్సింది. కొన్ని కారణాలతో ఆలస్యం కావడంతో మరో సినిమా, నా తొలి సినిమాగా విడుదలైంది. మెయిన్‌లీడ్‌గా మంచి క్యారెక్టర్ చేశాను.15న విడుదలవుతున్న ఈ సినిమాను చూసి అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది`` అన్నారు.
దర్శకుడు అశ్వినికుమార్ మాట్లాడుతూ - ``రెండేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. సినిమా బాగా చేశాం. మార్చి 15న విడుదలవుతున్న ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ - ``ఈ నెల 15న సినిమా విడుదలవుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. రెండేళ్లు సినిమా కోసం బాగా కష్టపడ్డాం. సాధారణంగా వెనుక నుండి వచ్చి ఎవరైనా ఉన్నట్టుండి చెయ్యేస్తే భయపడతాం. కానీ ఎవరూ లేకుండా అలా యాక్ట్ చేయడం చాలా కష్టం. అలాంటి ఫీలింగ్ ఉన్న సన్నివేశాలను నటీనటులు కష్టపడి చేశాం. సినిమా బాగా ఉంటుంది. డైరెక్టర్ అశ్వినికుమార్ సినిమా బాగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు సంగీతం అందించడాన్ని ఎంజాయ్ చేశాను`` అన్నారు.
విమల్ కృష్ణ మాట్లాడుతూ - ``సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. అయితే మా కాన్ఫిడెన్స్ ఏమాత్రం మారలేదు. మంచి సినిమా చేశాం. హారర్ కంటే ఇద్దరు సిస్టర్స్ మధ్య మంచి సెంటిమెంట్ మెప్పిస్తుంది. శ్రీచరణ్ తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాడు`` అన్నారు.
అభినవ్ గోమటం మాట్లాడుతూ - ``ఇదొక సైకాలాజికల్ హారర్ థ్రిల్లర్. డిఫరెంట్ రోల్ ప్లే చేశాను. హారర్ కామెడీ కాదు కాబట్టి.. కామెడీ పెద్దగా ఉండదు. అశ్విన్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. నిర్మాతగా శ్వేతా ఎలాంటి సినిమాలను భవిష్యత్‌తో చేస్తారనడానికి ఇదొక ఉదాహరణ. ఒక కొత్త ప్రయత్నం. అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్, శ్రీతా చందనా.ఎన్, విమల్ కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్ట్రిల్స్: కృష్ణ, పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్ భాను, విఎఫ్ఎక్స్: వెంకట్.కె, మేకప్: చిత్రా మోద్గిల్, సౌండ్ డిజైన్, మిక్సింగ్: విష్ణు పి.సి, అరుణ్.ఎస్, క్యాస్టూమ్ డిజైనర్: అశ్వంత్, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగడ, కొరియోగ్రాఫర్: ఉదయ్‌భాను(యుడి), ఆర్ట్: కిరణ్ కుమార్.ఎం, ఎడిటర్: గ్యారీ బి.హెచ్, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: సునీల్‌కుమార్.ఎన్, ప్రొడ్యూసర్: శ్వేతా సింగ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్వినికుమార్.వి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout