‘జెర్సీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. గౌతమ్‌కి హిట్ దక్కేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు టాలీవుడ్‌కు దగ్గరవుతుంది. బాలీవుడ్ దర్శక నిర్మాతలు మన సినిమాలను హిందీలో రీమేక్ చేయడం కాదు.. మన దర్శక నిర్మాతలు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తెలుగులో ఈయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీ రీమేక్‌కు డైరెక్షన్ వహించి హిట్ కొట్టాడు. ఆ తర్వాత అనుష్క టైటిల్ పాత్రలో నటించిన భాగమతి సినిమాను హిందీలో దుర్గామతి అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు.
ఇప్పుడు మరో టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈయన తెలుగులో నానితో తెరకెక్కించిన చిత్రం జెర్సీ. ఈ సినిమా సాధించిన సక్సెస్‌తో మన తెలుగు నిర్మాతలైన అల్లు అరవింద్, దిల్‌రాజు అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 5న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మరి జెర్సీ తెలుగులో సాధించినట్లే హిందీలోనూ విజయం సాధిస్తుందా? గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ డెబ్యూ డైరెక్టర్‌గా సక్సెస్ అవుతాడా? అని తెలియాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments