'జెర్సీ' జోడి కుదిరింది
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో నేచురల్ స్టార్ నాని, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందిన చిత్రం `జెర్సీ`. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తెలుగులో వస్తున్న యూనివర్సల్ కంటెంట్ సినిమాలను ఇతర చిత్ర పరిశ్రమలు ఆదరిస్తున్నాయి. అందులో భాగంగా బాలీవుడ్లో ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే మన తెలుగు నిర్మాతలైన అల్లు అరవింద్, దిల్‌రాజు బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్‌తో కలిసి ఈసినిమాను నిర్మిస్తుండటం విశేషం.
తెలుగులో నాని చేసిన క్రికెటర్ పాత్రను హిందీలో షాహిద్ కపూర్ చే్స్తున్నారు. ప్రస్తుతం ఆయన క్రికెట్ నేర్చుకుంటున్నాడు. కాగా ప్రీ ప్రొడక్షన్లో భాగంగా హీరోయిన్గా మృణాల్ ఠాకూర్‌ను చిత్ర యూనిట్ ఓకే చేసింది. ఈ విషయాన్ని హీరోయిన్ కన్ఫర్మ్ చేసింది. ఎమోషనల్ జర్నీగా సాగే `జెర్సీ` తెలుగు వెర్షన్‌ను చూసిన మృణాల్ ఠాకూర్ వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పేసింది. చాలా ఎగ్జయిటెడ్‌గా ఎదురుచూస్తున్నట్లు కూడా తెలిపారు. తెలుగులో ఈ పాత్రను శ్రద్ధా శ్రీనాథ్ చేశారు. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ జర్నీ ఇది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout