'జెర్సీ' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ఎమోషనల్ క్రికెట్ డ్రామా 'జెర్సీ'. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించే చిత్రమే ఇది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది.
సెన్సార్ పూర్తి కావడంతో సినిమా విడుదలకు క్లియరెన్స్ దొరికినట్టే. నాని గత చిత్రాలు దేవదాసు, కృష్ణార్జునయుద్ధం చిత్రాలు ఆశించిన మేర విజయాలను సాధించలేదు. దీంతో నాని ఈ చిత్రం పై చాలా ఆశలనే పెట్టుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments