రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన జీవిత..

  • IndiaGlitz, [Wednesday,November 04 2020]

సీనియర్ నటుడు రాజశేఖర్ కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవిషయం తెలిసిందే. కాగా కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని వార్తలొచ్చాయి. అప్పటి నుంచి వైద్యులు ఆయనను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్సను అందించినట్టు వార్తలొచ్చాయి. కానీ రాజశేఖర్‌కు వైద్యులు నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్‌ను అందించారు. అనంతరం ఆయన కోలుకోవడంతో వెంటిలేటర్‌ను తొలగించినట్టు కూడా వార్తలొచ్చాయి. రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవిత తాజాగా స్పందించారు.

‘‘రాజశేఖర్ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి బాగా సహకరిస్తున్నారు. మొదట ఆయన ఆరోగ్యం చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లింది. వైద్యులు మేము చాలా భయపడ్డాం. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోంది. తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఆరోగ్యం బాగుపడలని కోరుకున్న అభిమానులందరికి ధన్యవాదాలు’’ అని జీవిత తెలిపారు.

More News

మేజిక్ ఫిగర్‌కు దగ్గరగా బైడెన్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ జరగడం విశేషం.

బైడెన్.. ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలివే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.

అమ్మో రాజశేఖర్.. బీభత్సం చేసేశాడు..

నిన్నటి నామినేషన్ పర్వం నేడు కూడా కొనసాగింది. నిన్న అవినాష్‌ని అభి నామినేట్ చేశాడు. ఇవాళ అమ్మ రాజశేఖర్‌ను నామినేట్ చేశాడు.

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. బైడెన్, ట్రంప్ మధ్య హోరాహోరీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో ముగిసింది. కాగా.. పోలింగ్ ముగిసిన రాష్రాల్లో బుధవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.

ఎంబీఎస్ జ్యువెల్లర్స్‌కు భారీ జరిమానా.. ఈడీ చరిత్రలోనే తొలిసారిగా..

భారత ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ చరిత్రలో కనీ వినీ ఎరుగని పరిణామం చోటు చేసుకుంది.