నరేష్ వివరణ..జీవిత ఘాటు స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. రీసెంట్గా జరిగిన ప్రెస్‌మీట్ అనంతరం ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని సెక్రటరీ జీవితా రాజశేఖర్ చెప్పడంతో వివాదం రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే అధ్యక్షుడు నరేష్, తనకు ముందుస్తు సమాచారం లేకుండా మీటింగ్‌ను కండెక్ట్ చేశారని ఆయన వీడియో విడుదల చేశారు. దీనిపై జీవితా రాజశేఖర్, హేమ, ఈసీ మెంబర్ జయలక్ష్మి పాల్గొన్నారు.
జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "950 సభ్యుల్లో 26 మంది ఈసీ మెంబర్స్గాఎన్నికయ్యాం. అందులో ఒక ప్రెసిడెంట్, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్స్, ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీ, 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు. ఇందులో 18 మంది సభ్యులు ఒకవైపు ఉంటే 8 మంది మరో వైపు ఉన్నారు. నరేష్‌గారు మీటింగ్ పెట్టి ఇలా చేయాలనుకుంటున్నామని అంటారు. మమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయం తీసేసుకుంటారు. ఎవరైనా అడిగితే అది అంతేనండీ! అంటారు. దానికి మేమందరం సరేనని చెప్పి సంతకాలు పెట్టాలి. ఆయన వీడియోలో చెప్పినట్లు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌లు విజయవంతంగా జరగలేదు" అన్నారు.
సమీర్ మాట్లాడుతూ ``మాలో ఎవరినీ నరేష్‌గారు కలుపుకు పోవడం లేదు`` అన్నారు.
"నరేష్ అందరినీ పిలిచి మాట్లాడండి. మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి" అని హేమ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout