న‌రేష్ వివ‌ర‌ణ‌..జీవిత ఘాటు స్పంద‌న‌

  • IndiaGlitz, [Thursday,October 24 2019]

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) వివాదం రోజు రోజుకు పెరుగుతూ వ‌స్తుంది. రీసెంట్‌గా జ‌రిగిన ప్రెస్‌మీట్ అనంత‌రం ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తామ‌ని సెక్ర‌ట‌రీ జీవితా రాజ‌శేఖ‌ర్ చెప్ప‌డంతో వివాదం రోజుకొక మ‌లుపు తిరుగుతుంది. అయితే అధ్య‌క్షుడు న‌రేష్‌, త‌న‌కు ముందుస్తు స‌మాచారం లేకుండా మీటింగ్‌ను కండెక్ట్ చేశార‌ని ఆయ‌న వీడియో విడుద‌ల చేశారు. దీనిపై జీవితా రాజ‌శేఖ‌ర్‌, హేమ‌, ఈసీ మెంబ‌ర్ జ‌య‌ల‌క్ష్మి పాల్గొన్నారు.

జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ 950 స‌భ్యుల్లో 26 మంది ఈసీ మెంబ‌ర్స్‌గాఎన్నిక‌య్యాం. అందులో ఒక ప్రెసిడెంట్‌, ఇద్ద‌రు వైస్ ప్రెసిడెంట్స్‌, ఇద్ద‌రు జాయింట్ సెక్ర‌ట‌రీలు, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్స్ ఉన్నారు. ఇందులో 18 మంది స‌భ్యులు ఒక‌వైపు ఉంటే 8 మంది మ‌రో వైపు ఉన్నారు. న‌రేష్‌గారు మీటింగ్ పెట్టి ఇలా చేయాల‌నుకుంటున్నామ‌ని అంటారు. మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించ‌కుండా నిర్ణ‌యం తీసేసుకుంటారు. ఎవ‌రైనా అడిగితే అది అంతేనండీ! అంటారు. దానికి మేమందరం స‌రేన‌ని చెప్పి సంత‌కాలు పెట్టాలి. ఆయ‌న వీడియోలో చెప్పిన‌ట్లు ఎగ్జిక్యూటివ్ క‌మిటీ మీటింగ్‌లు విజ‌య‌వంతంగా జ‌ర‌గ‌లేదు అన్నారు.

స‌మీర్ మాట్లాడుతూ ''మాలో ఎవ‌రినీ న‌రేష్‌గారు క‌లుపుకు పోవ‌డం లేదు'' అన్నారు.

న‌రేష్ అంద‌రినీ పిలిచి మాట్లాడండి. మాట్లాడుకుంటే స‌మ‌స్య‌లు తీరిపోతాయి అని హేమ తెలిపారు.

More News

సీఎం కావాలని పగటి కలలు కనట్లేదు: పవన్

‘నేను ముఖ్యమంత్రి అవ్వాలని పగటి కలలు కనడం లేదు. 25 ఏళ్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం పార్టీని పెట్టాను.

బ్రేకింగ్: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టాలీవుడ్ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ని బెదిరించిన కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

అధ్యక్ష హోదాలో కొహ్లీతో దాదా తొలి మీట్!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అలియాస్ బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.

రాజధానిపై బొత్స మరోసారి కామెంట్స్.. కలకలం!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

రూ. 25 లక్షల చిరుతిండిపై లోకేష్ రియాక్షన్!

ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంత్రి హోదాలో గట్టిగా మేసేశారని...