రాజశేఖర్ రాజీనామాపై జీవిత స్పందన ఇదీ...

  • IndiaGlitz, [Monday,January 06 2020]

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి-యాంగ్రీస్టార్ రాజశేఖర్‌.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో భాగంగా మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో సజావుగా జరుగుతున్న కార్యక్రమం రసాభసగా మారింది. ఒకరిపై ఒకరు కోపతాపాలు చూపించుకోవడంతో మరోసారి చిరు వర్సెస్ రాజశేఖర్‌గా పరిస్థితులు మారాయి. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆ రాజీనామా లేఖను ఆదివారం నాడు ‘మా’ ఆమోదించింది. అంతేకాదు.. ‘మా’ క్రమశిక్షణా సంఘంను ఏర్పాటు చేయడం జరిగింది.

జీవిత పరిస్థితేంటి!?
అయితే ఈ రాజీనామా వ్యవహారం.. డైరీ ఆవిష్కరణలో జరిగిన గొడవపై తాజాగా జీవిత స్పందించారు. రాజశేఖర్ రాజీనామా చేసి మంచిపనే చేశారని.. ఆయన నిర్ణయం నిజంగానే సరైనదేనన్నారు. ‘మా’లో నెలకొన్న సమస్యల పరిష్కార మార్గం కోసం పదుల సంఖ్యలో సభ్యులు వేచి చేస్తున్నారు. అంతేకాదు.. రాజశేఖర్‌ ప్రస్తావించిన సమస్యలపై క్రమశిక్షణ సంఘం దృష్టి పెట్టాలి. క్రమశిక్షణా సంఘం పరిష్కారం చూపుతుందనే నమ్మకం ఉంది. వారి పరిష్కారం బట్టి మా నిర్ణయం ఉంటుంది’ అని జీవిత స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ క్రమశిక్షణ ఎలా తీసుకుంటారు..? రాజశేఖర్ స్థానానికి ఎన్నికలు ఉంటాయాలేదా..? జీవిత పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.