close
Choose your channels

అసలేం జరిగింది..: రాజశేఖర్ రోడ్డుప్రమాదంపై జీవిత వివరణ

Wednesday, November 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అసలేం జరిగింది..: రాజశేఖర్ రోడ్డుప్రమాదంపై జీవిత వివరణ

టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌లోని ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న చిన్న గాయలతో హీరో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంపై మీడియా, వెబ్‌సైట్లలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. మద్యం మత్తులో వాహనం నడిపాడని.. కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయని.. 180 వేగంతో కారులో వస్తున్నట్లు.. ఇలా పలు చిత్రవిచిత్రాలు కథనాలు వెలువడటంతో రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది..? కాపాడిందెవరు..? ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది..? అనే విషయాలను రాజశేఖర్ సతీమణి జీవిత వివరణ ఇచ్చారు.

అసలేం జరిగింది..!?

రాజశేఖర్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని చాలా మంది తనకు ఫోన్ కాల్స్ చేశారని.. మరోవైపు అభిమానులు ఆందోళన చెందుతుండటంతో అసలేం జరిగింది అనే విషయాలను చెప్పడానికి మీ ముందుకు వచ్చానని జీవిత చెప్పుకొచ్చారు. మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయని.. అవన్నీ తప్పేనని ఆమె ఖండించారు. ‘నిన్న రాత్రి 1.30 గంటలకు రామోజీఫిలిం సిటీ నుంచి రాజశేఖర్ గారు ఇంటికి వస్తుండగా బెంజ్ కారు టైర్ పగిలి కంట్రోల్ తప్పింది. దీంతో డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఆ సమయంలో ఎదురుగా కారులో వస్తున్న వాహనం ఆపి.. అందులో ఉన్న వాళ్లు రాజశేఖర్‌ను గుర్తుపట్టి సాయం చేశారు. వాళ్ల ఫోన్ నుంచే ప్రమాదం గురించి పోలీసులు.. మాకు తెలిపారు. వాళ్ల కారులోనే సగం దూరం రాగా.. మేము మా కారులో వెళ్లి పికప్ చేసుకున్నాం’ అని జీవిత చెప్పుకొచ్చింది.

నిజంగా ఇది చాలా పెద్ద ప్రమాదం..!

‘ఆ తర్వాత నేను పోలీసులకు ఫోన్ చేసి ప్రమాదం గురించి వివరాలు చెప్పాను. రాజశేఖర్ గారి వస్తువులన్నీ వెరిఫై చేశాక.. రాజశేఖర్ గారు క్షేమమే కదా అని అడిగారు. రాజశేఖర్‌తో కూడా మాట్లాడారు. ఆ తర్వాత డాక్టర్ ఇంటికి వచ్చి ఆయన్ను చూశారు. ఒక చిన్న గాయం తప్ప ఎలాంటి బలమైన గాయాలేమీ లేవని తెలిపారు. ప్రాథమిక చికిత్స చేశారు. ప్రమాదానికి సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వాలని పోలీసులు కోరారు. రాజశేఖర్ కోలుకున్నాకే ఇవ్వండి చెప్పగా..  తప్పకుండా వస్తామని చెప్పాం. నేను కూడా పోలీసులతో టచ్‌లో ఉన్నాను. సీఐ వెంకటేశ్వరరావుగారితో మాట్లాడాను. వాస్తవానికి ఇది చాలా పెద్ద ప్రమాదం.. కానీ రాజశేఖర్ గారిని అభిమానించే అందరి ప్రేమ వల్లే ఆయన చిన్నపాటి గాయంతోనే క్షేమంగా బయటపడ్డారు. మీ అందరి ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు’ అని జీవిత వీడియోలో వెల్లడించారు. జీవిత వివరణతో చాలా వరకు పుకార్లకు ఫుల్‌స్టాప్ పడినట్లైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment