మేమేంటో చూపిస్తాం: జీవితా రాజశేఖర్
Send us your feedback to audioarticles@vaarta.com
‘మా’ ఎన్నికల్లో పోటీ చేయొద్దని పదేపదే చెప్పినా వినకండా యాంగ్రీస్టార్ రాజశేఖర్ బరిలోకి దిగారని జీవితా చెప్పుకొచ్చారు. కౌంటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎన్నికల బరిలో నిలబడమని నరేశ్ నుంచి పిలుపువచ్చినప్పుడు అసలేం జరిగిందనే విషయాలను ఆమె వివరించారు.
క్యారమ్స్ ఆడి ఓడిపోతే ఆయన భరించలేరని అంత సెన్సిటివ్ క్యారెక్టర్‌ను ఎన్నికల్లోకి ఎందుకులే దింపడమని వద్దని చెప్పాం కానీ నరేశ్ మాత్రం లేదు.. లేదు కచ్చితంగా బరిలోకి దిగాల్సిందేనని పట్టుబట్టారన్నారు.
జీవితా మాటల్లోనే..
" మేం వద్దంటే ఆయన సరే చేయట్లేదు అని మాకు చెప్పి.. నరేశ్‌కు పోటీ చేస్తాను అని చెప్పారు. మా ఫ్యామిలీ అందరం ఒప్పుకున్నాక అందర్నీ కలిసి ప్రచారం నిర్వహించాము. మా ఆపోజిట్ టీమ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి.. చాలా కష్టపడ్డాం ఆఖరికి మా పిల్లలను కూడా ప్రచారంలోకి దించేశారు రాజశేఖర్. ఇదిగో ఈ డైరీలో ఉండే నంబర్స్‌కు ఫోన్ చేయమని మా పిల్లలకు కూడా రాజశేఖర్ రంగంలోకి దింపారు.
పిల్లలు సభ్యులందరితో మాట్లాడి నాన్నకు సపోర్ట్ చేయమని చెప్పారు. మనకు అది కావాలి.. ఇది కావాలి అని ‘మా’ను అడగటం కాదు.. మనం స్ట్రాంగ్ ప్యానెల్‌ను ఎన్నుకోవాలి. మా ప్యానెల్‌కు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాము(రాజశేఖర్, జీవిత చేతులెత్తి). ఎవరం గెలిచామన్నది ముఖ్యం కాదు అందరం కలిసి పనిచేస్తాము.
పెద్దలందరూ సహకరించారు..
"ఒక్కరు ఇద్దరని కాదు.. చిరు, నాగ్, మోహన్‌బాబు, వెంకీ, బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబును షూటింగ్ దగ్గరికెళ్లి కలిశాము. ప్రతి ఒక్కరూ ఓటేస్తాము.. సపోర్ట్‌గా నిలుస్తామన్నారు. గెలిచాక అన్నీ ప్రాపర్‌గా ప్లాన్ చేయండి మీ వెనుక మేముండి నడిపిస్తామని అందరూ చెప్పారు. 'మా'కు బిల్డింగ్ మొదలుకుని అన్నీ చేద్దామని చిరంజీవి ప్రామిస్ చేశారు.
వారందరి సాయం తీసుకుంటాము. సభ్యులందరికీ న్యాయం చేస్తాము. ప్రతీ మూడ్నెళ్లకోసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అందర్నీ కలుస్తాము. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.. వుయ్ విల్ డూ బెస్ట్. అరే.. తెలుగు మూవీ అసోసియేషన్ ఎంత బాగుంది అని అనుకులే చేస్తాం. వాళ్ల నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉందే అని అనుకునేలా చేస్తాం. ఇంత పెద్ద సక్సెస్ అందించినందుకు పేరుపేరునా ధన్యవాదాలు" అని జీవిత తెలిపారు.
హేమకు హ్యాట్సాప్.. మేమేంటో చూపిస్తాం
"ఈసారి ఎన్నికల్లో చాలా మంది మహిళలు గెలిచారు. హేమ ఇండిపెండెంట్‌గా కంటెస్ట్ చేసి పెద్ద మెజార్టీతో గెలిచింది. హ్యాట్సాప్ హేమ. ఆడవాళ్ల సత్తా ఏంటో చూపిస్తాం. ప్యానెల్లో ఎక్కువగా ఆడవాళ్లున్నాము. ఎక్కువ మంది ఆడవాళ్లుంటే పాలన ఎలా ఉంటుందనేది మేం చూపిస్తాం" అని జీవిత చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout