close
Choose your channels

మళ్లీ బీజేపీలోకి జీవిత.. ఇంకెన్నిసార్లో!?

Monday, January 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మళ్లీ బీజేపీలోకి జీవిత.. ఇంకెన్నిసార్లో!?

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత దంపతులు ఇప్పటి వరకూ ఎన్ని రాజకీయ పార్టీలు మారారో బహుశా వాళ్లకే గుర్తుండదేమో. అటు పోయినప్పుడు.. ఇటువాళ్లను విమర్శించడం.. ఇటున్నప్పుడు అటు వాళ్లను విమర్శించడం వీరికి పరిపాటిగా వస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ మారిన ఈ దంపతులు 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. అంతేకాదు ఎన్నికల ప్రచారం కూడా కొన్ని నియోజకవర్గాల్లో చేశారు. ఎవరూ ఊహించని రీతిలో వైసీపీకి సీట్లు కూడా వచ్చాయ్.. జగన్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ తమకు సముచిత స్థానం ఇవ్వలేదన్న అసంతృప్తితోనో లేకుంటే ఇతరత్రా కారణాలున్నాయో తెలియదు కానీ ఆ పార్టీకి ఝలక్ ఇచ్చేసి తెలంగాణ బీజేపీలో జీవితారాజశేఖర్ చేరిపోయారు.

ఎందుకిలా జరిగిందో..!?

సోమవారం నాడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమక్షంలో జీవిత తనకు తానుగా కండువా కప్పుకున్నారు!. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ కండువా కప్పిన బండి.. జీవితకు కండువా కప్పలేదు. ఎన్ని పార్టీలు మారతారు మేడమ్ అనుకున్నారో లేకుంటే మళ్లీ బీజేపీలోకి వస్తున్నారా..? కండువా కప్పడమెందుకు అనుకున్నారో తెలియదు కానీ బండి మాత్రం జీవితకు కాషాయం కండువా కప్పడానికి సాహసించలేదు. సుమారు గంటపాటు ఈ చేరికల కార్యక్రమం జరిగింది. గంట నుంచీ బండి పక్కనే ఉన్నప్పటికీ జీవితతో మాట్లాడారే కానీ కండువా మాత్రం కప్పలేదు. దీంతో కండువా కోసం వేచి చూసిన జీవిత చివరికి తన మెడలో తానే కండువా వేసుకున్నారు. ఈ ఆసక్తికర పరిణామం చూసిన కొత్తగా బీజేపీలో చేరిన జనాలు ఒకింత నవ్వుకున్నారు కూడా. అయితే ఈ కార్యక్రమానికి రాజశేఖర్ దూరంగా ఉన్నారు. మరి ఆయన కూడా బీజేపీలోనే చేరుతారో లేకుంటే వైసీపీలోనే కొనసాగుతారో వేచి చూడాలి.

ఇంకెన్ని మారుతారో..!?

కాగా.. జీవిత దంపతులు దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు, దేశంలోని జాతీయ పార్టీల్లో పనిచేశారు. అయితే తిరిగి తిరిగి మళ్లీ బీజేపీ గూటికే చేరారు. బహుశా ఇక మిగిలింది టీఆర్ఎస్, జనసేన, ప్రజాశాంతి పార్టీలేనేమో. జీవిత వైసీపీకి టాటా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకెన్ని పార్టీలు మారతారు మేడం.. ఇంకెన్ని సార్లు బీజేపీలో చేరతారు..? అంటూ నెట్టింట వైసీపీ కార్యకర్తలు, బీజేపీ ఫాలోవర్స్, నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. తనకు తానుగా కండువా కప్పుకున్న జీవిత బీజేపీలో చేరినట్లా..? లేకుంటే వైసీపీలోనే ఉన్నట్లా..? అనేది ఆమెకే తెలియాలి. రేపో మాపో ప్రెస్‌మీట్ పెడితే అసలు విషయాలన్నీ బయటికొస్తాయేమో..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment