ప్రతి ఒక్కరి హార్ట్ కు టచ్ అయ్యే సినిమా “శేఖర్”.. దర్శకురాలు జీవితా రాజశేఖర్
Send us your feedback to audioarticles@vaarta.com
రాజశేఖర్ గారి అక్క మొగుడు, సింహరాశి, గోరింటాకు, సినిమాలు ప్రేక్షకులను ఏవిధంగా అలరించాయో ఇప్పుడు వస్తున్న "శేఖర్ " సినిమా కూడా అంతే ఎమోషన్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు చిత్ర దర్శకురాలు జీవిత రాజశేఖర్. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజశేఖర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "శేఖర్". ఈ చిత్రాన్ని వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో ముత్యాల రాందాస్ గారు ఇండియా వైడ్ విడుదల చేస్తుండగా నిర్వాణ సినిమాస్ సృజన ఎరబోలు ఓవర్సీస్ లో విడుదల చేస్తున్నారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం లోని పాటలను విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఏ.యం.బి మాల్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన హీరో అడవి శేష్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.ఇంకా దర్శకులు పవన్ సాదినేని, నటి ఈషా రెబ్బా మరియు చిత్ర యూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం
హీరో అడవి శేషు మాట్లాడుతూ.. "శేఖర్" సినిమా ట్రైలర్ చాలా బాగుంది.రాజశేఖర్ సర్ అంటే నాకు చాల ఇష్టం.తను చేసిన "మగాడు" నాకు అల్ టైం ఫెవరేట్ సినిమా.మంచి కంటెంట్ తో వస్తున్న "శేఖర్" సినిమా తనకు,తన టీం కు గొప్ప పేరు తీసుకురావాలని కోరుతున్నాను.మే 20 న వస్తున్న ఈ సినిమా అందరికీ గొప్ప విజయం సాధించాలని అన్నారు
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ .. ముంబైలో ఎంతో బిజీగా ఉన్నా మా ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన అడవి శేష్ కు ధన్యవాదాలు. అలాగే మాకెంతో సపోర్ట్ చేసిన మా నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, వంకాయలపాటి మురళీక్రిష్ణ లకు ధన్యవాదాలు. ఈ సినిమాను ఫ్యామిలీలా అంతా కలిసి చేశాము. పవన్ చెప్పినట్లు మాకు సినిమానే లోకం. ఈ సినిమానే ఆశ,శ్వాశగా జీవిస్తున్నాము. సినిమా తప్ప మాకు ఏమీ తెలియదు. ఇందులోనే మేము చాలా పోగొట్టుకున్నాం. ఇంతకుముందు నేను చేసిన సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ టెన్షన్. ఎందుకంటే ఈ సినిమాకు దర్శకురాలిగా కూడా పనిచేశాను. ఉమెన్స్ ఎక్కువగా వర్క్ చేసినా కూడా ఎక్కువ మంది ఎంకరేజ్ చెయ్యారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఓటిటి లకు అలవాటు పడ్డారు పెద్ద బడ్జెట్ సినిమాలన మాత్రమే చూస్తారు అని చాలా మంది చెప్పారు.అయితే ఇప్పుడు మేము తీసిన ఈ సినిమా ఫ్యామిలీ అందరికి కచ్చితంగా నచ్చుతుంది. ఇంతకు ముందు వచ్చిన రాజశేఖర్ గారి అక్క మొగుడు, సింహరాశి, గోరింటాకు, సినిమాలు ప్రేక్షకులను ఏవిధంగా అలరించాయో ఇప్పుడు వస్తున్న "శేఖర్ " సినిమా కూడా అంతే ఎమోషన్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎమోషనల్ గా అవుతారు. ఈ సినిమా పూర్తి కావడానికి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేస్తూ ఎంతో కష్టపడి, ఇష్టంగా చేశారు వారందరికీ నా ధన్యవాదాలు.మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు
హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమా స్టార్ట్ అయి నప్పుడు నేను కోవిడ్ వల్ల సిక్ అయ్యి చాలా సీరియస్ గా ఉండి మళ్ళీ మీ అందరి ప్రేమ వల్ల బతికి బయటపడ్డాను. అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ ప్రే చేసి నన్ను బతికించింది ఈ సినిమా కోసమే.దర్శకుడు పవన్ చెప్పినట్లు సినిమా అంటే మాకు ప్రాణం.ఈ సినిమాను మేమంతా ప్రాణం పెట్టి తీశాము.ముందు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలను కున్నాము కానీ కొన్ని పరిస్థితుల వలన కుదరలేదు. ఇన్ని రోజులకి కుదిరింది.ఈ సినిమాను మే 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మేము ప్రేక్షకులకు చెప్పేది ఒకటే... థియేటర్ వచ్చి సినిమా చూసిన వారు బాగుంది అంటేనే మా సినిమా చూడండి అని చెపుతున్నాము.ఎందుకంటే మాకు ఈ సినిమాపై అంత నమ్మకం ఉంది.మేము పడిన కష్టం ఎలా ఉందో అనేది మీరంతా సినిమా చూస్తే తెలుస్తుంది అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాసు గారు మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమా చాలా బాగా వచ్చింది అంటే చూశాను. జీవిత గారి మంచి కథను సెలెక్ట్ చేసుకొని తనే దర్శకత్వం వహించి చాలా చక్కని సినిమాను తీశారు. సినిమా చూశాను చాలా బాగుంది. అందుకే నేను ఈ సినిమాను ఇండియా వైడ్ గా విడుదల చేస్తున్నాను. 20 న వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించాలని అన్నారు
దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ.. రాజశేఖర్ గారు అన్నీ తానై నటించిన శేషు సినిమా చూసిన తరువాత చాలా రోజులు ట్రాన్స్ లోనే వున్నాను.ఆ సినిమా నాకు అంత బాగా నచ్చింది. ఇప్పుడు వారి ఫ్యామిలీ నుండి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా బాగుంది.అనూప్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ నెల 20 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. రాజశేఖర్ జీవిత గార్ల జర్నీ పెళ్ళికి ముందు నుంచి చూస్తే "మగాడు" నుంచి ఇప్పుడు వచ్చే "శేఖర్" వరకు ఫ్యామిలీ అందరికి నచ్చే కుటుంబ కథా చిత్రాల్లోనే నటించారు.వీరు ఏ సినిమా చేసినా చాలా కడ్తపడి పనిచేస్తారు. ఈ "శేఖర్" సినిమాను కూడా ఫ్యామిలీ అందరూ ఎంతో మనసుపెట్టి తీశారు. ఈ సినిమాకు జీవిత దర్శకురాలిగా, రాజశేఖర్ హీరోగా, తన ఇద్దరు కూతుర్లు కూడా ఈ మధ్య హీరోయిన్స్ గా చేస్తూ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇందులో నాకు మంచి పాత్ర ఇచ్చారు. రాజశేఖర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అద్భుతమైన పాత్ర చేశారు. అన్ని రకాల ఎమోషన్స్ తో చేసిన సినిమా శేఖర్. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయినా ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుతున్నాను.ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "శేఖర్" సినిమాను ముత్యాల రామదాసు, సృజన ఎరబోలు గార్లు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.టీమ్ అందరికీ మంచి పేరు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
నటి శివాని రాజశేఖర్ మాట్లాడుతూ.. మా ఫ్యామిలీ అంతా కలిసి చేసిన సినిమానే "శేఖర్".మేము ఎంత ప్రేమను పెట్టి చేశాము అనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది.నేను మిస్ ఇండియా పోటీలి ఎలిజిబుల్ అవడానికి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు మూడు రాష్ట్రాలు సెలెక్ట్ చేసుకుంటే తమిళనాడు నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వగా నేను తమిళనాడు కంటెస్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్ అని పెట్టుకున్నాను అన్నారు.
నటుడు రవి వర్మ మాట్లాడుతూ.. శేఖర్ సినిమా రెగ్యులర్ ఫార్మాట్ మూవీ లా ఉండదు.ఏమోషన్ తో అటాచ్ అయిన యాక్షన్ ఇందులో ఉంటుంది .ఈ ప్యాండమిక్ లో చాలామందికి అన్ఫార్చునేట్ థింగ్స్ చాలా జరిగాయి. అటువంటి ఎమోషన్స్ను మళ్లీ మనకు గుర్తు చేస్తూ మంచి ఇంటెన్షన్ తో వస్తున్న "శేఖర్" సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడ వలసిన సినిమా అవుతుంది అన్నారు.
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని విడుదలైన కొన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఎమోషన్స్ ఉన్న మంచి సినిమా చేసాము అనిపించింది అన్నారు
నటి ఈషా రెబ్బా మాట్లాడుతూ.. సినిమా చూశాను ఇందులో కొన్ని సీన్స్ చాలా ఎమోషన్స్ కలిగించాయి.నాకీ సినిమా చాలా బాగా నచ్చింది. ట్రైలర్ లో చూపించింది చాలా తక్కువ సినిమాలో ఇంకా ఇలాంటి సీన్స్ చాలా ఉంటాయి.ఇందులో రాజశేఖర్ గారు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. శివాని చాలా బాగా చేసింది.ఇంకా మిగిలిన వారంతా చాలా చక్కగా నటించారు అన్నారు
నటీనటులు: రాజశేఖర్, ప్రకాష్ రాజ్, శివాని రాజశేఖర్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటిస్తున్న
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments