జీవిత డేరింగ్ డెసిషన్.. ప్రకాష్ రాజ్, విష్ణుపై పోటీ?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ లో మా ఎన్నికల హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. మొదట విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాను మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్రకటనే టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ వందలాది తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ అతడు నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉంది.
ఇదీ చదవండి: 'ఎల్కేజీ' ట్రైలర్: లక్ష్మణ్ సెంచరీ కొడితే ఒకలా.. మత్స్యకారుడు చనిపోతే మరోలా..
ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కు పోటీగా మంచు విష్ణు బరిలోకి దిగాడు. టాలీవుడ్ సీనియర్స్ మద్దతు కూడగట్టుకుంటున్నాడు. అయితే తాజాగా మా ఎన్నికల హీట్ పెరిగేలా ఓ వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం మా సెక్రెటరీ గా ఉన్న జీవితా రాజశేఖర్ అధ్యక్ష పదవికి బరిలోకి దిగబోతున్నట్లు టాక్. ప్రకాష్ రాజ్, విష్ణుపై పోటీకి ఆమె సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సెక్రెటరీగా ఉన్న తాను టాలీవుడ్ కోసం ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటే అధ్యక్ష పదవి దక్కించుకోవాలని భావిస్తున్నారట. జీవిత, రాజశేఖర్ దంపతులు ఇద్దరూ టాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్స్. ఎలాంటి విషయంలో అయినా ఢీ అంటే ఢీ అంటారు.
ఒక వేళ జీవితా రాజశేఖర్ బరిలోకి దిగితే మా ఎన్నికల పోరు ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే టాలీవుడ్ లో సీనియర్స్ మద్దతు 'మా' ఎన్నికల్లో కీలకం. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ఈ ముగ్గురిలో ఎవరు ఎవరికి మద్దతుగా ఉంటారనేది కీలకంగా మారింది.
ప్రకాష్ రాజ్ అంటే సినీ ప్రముఖులందరికీ ఇష్టమే. అలాగే మంచు ఫ్యామిలీకి కూడా అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల మోహన్ బాబు చిరంజీవితో ఎక్కువ సాన్నిహిత్యంతో ఉంటున్నారు. ఈ తరుణంలో జీవితకు ఎవరు మద్దతు తెలుపుతారు అనేది ఆసక్తిగా మారింది. రాజశేఖర్, చిరంజీవి మధ్య బహిరంగంగానే విభేదాలు ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com