'మా' మీటింగ్ గురించి జీవిత వివ‌ర‌ణ‌

  • IndiaGlitz, [Monday,October 21 2019]

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు సంబంధించిన జ‌న‌ర‌ల్ మీటింగ్ ఆదివారం జ‌రిగింది. న‌రేష్ వ‌ర్గం, జీవిత‌-రాజ‌శేఖ‌ర్‌కి వ‌ర్గాలుగా అంద‌రూ విడిపోయార‌ని వార్త‌లు వినిపించాయి. అందుకు త‌గిన‌ట్లే మా స‌మావేశం వాడి వేడిగా జరిగింది. కొంద‌రు స‌భ్యులు స‌మావేశం నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. మీటింగ్ ముగిసిన అనంత‌రం జీవి, రాజ‌శేఖ‌ర్ మా మీటింగ్ గురించి ఏమీ మాట్లాడ‌లేదు. త‌ర్వాత మాట్లాడుతామ‌ని చెప్పి వెళ్లిపోయారు. సోమ‌వారం రోజున మా మీటింగ్ గురించి జీవిత ఓ వీడియో విడుద‌ల చేశారు.

''మా జ‌న‌ర‌ల్ మీటింగ్ జ‌ర‌గ‌ద‌ని, జ‌రుగుతుంద‌ని, కోర్టు స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని... ఇలా పలు వార్త‌ల‌తో సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఇన్నీ వార్త‌లు మ‌ధ్య కూడా దాదాపు 200 మంది స‌భ్యులు స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. మాలో కొన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. 26 మంది ఎన్నికైన కూట‌మిలో కొన్నిఅభిప్రాయ భేదాలు వ‌చ్చాయి. ఈ అభిప్రాయ భేదాల‌ను మేం ప‌రిష్క‌రించుకోలేక‌పోయాం. దానికి కార‌ణాలేంట‌ని చెప్ప‌లేను కానీ.. స‌మావేశంలో స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు. కొన్ని వాద‌న‌లు జ‌రిగాయి, కొన్ని సంద‌ర్భాల్లో ఎమోష‌న‌ల్ అయ్యాం. కొన్నిసార్లు స‌ర్ది చెప్పుకున్నాం. ఈ మీటింగ్ ప్ర‌స్తుత 'మా' ఉన్న ప‌రిస్థితులకు ఎంతో ఉప‌యోగ‌ప‌డే మీటింగ్ అనే చెప్పాలి. కొన్ని సెన్సిబుల్ డిసిష‌న్స్ కూడా తీసుకున్నాం.

ఓ ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలని మీటింగ్‌లో ఫైన‌ల్‌గా తేలింది. 'మా' లోని మొత్తం 900పై చిలుకు స‌భ్యుల్లో 20 శాతం మంది అంటే దాదాపు 200 మంది మాకు ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ అవ‌స‌రం అని కోరుకుంటే ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవ‌చ్చు. స‌భ్యులు ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత 21 రోజుల్లో ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మీటింగ్ జ‌ర‌గాలి.. జ‌రిగితే మ‌న‌కు మంచి జ‌ర‌గుతుంద‌ని స‌మావేశానికి వ‌చ్చిన 90 శాతం మంది అనుకున్నాం'' అని జీవిత తెలిపారు.