'ఒకటే లైఫ్' మోషన్ పొస్టర్ లాంఛ్ చేసిన జీవా

  • IndiaGlitz, [Monday,March 19 2018]

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం ఒకటే లైఫ్ .హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు.

శృతి యుగల్ హీరొయిన్ గా  నటిస్తొన్న ఈ చిత్రంలొ సుమన్ ప్రదాన పాత్రలొ కన్పించనున్నారు. త్వరలొ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు మోషన్ పొస్టర్ ను యంగ్ హీరో జీవా , సూపర్ గుడ్ ఫిలింస్ కార్యాలయంలొ లాంఛ్  చేశారు.

ఈ సందర్బంగా జీవా మాట్లాడుతూ.. ఒకటే లైఫ్ మోషన్ పొస్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. సరికొత్త కధాకధనాలతో తెరకెక్కతొన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుదని జీవా చిత్ర యూనిట్ కు విషెష్ ను తెలియ చేశారు

దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ..  టెక్నాలజీ పేరుతో పరుగులెడుతొన్న నేటి తరం హ్యూమన్ రిలెషన్స్ కు ఎమోషన్స్ కు  ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతొన్న చిత్రమిది. సూపర్ గుడ్ అధినేత ఆర్.బి.చౌదరి గారబ్బాయి జితన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు.మంచి సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకుల కు మా సినిమా కలిగిస్తుందన్నారు.

నిర్మాత నారయణ్ రామ్ మాట్లాడుతూ.. , మా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పొస్టర్ ఆవిష్కరించిన జీవా గారికి ధన్యవాదాలు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా టీమ్ అందరికీ మంచి పేరును తీసుకువచ్చె చిత్రంగా నిలుస్తుంది. అతి త్వరలొనె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నారు

జితన్ రమేష్, శృతియుగల్, సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి ,శ్యామ్ ,దిశ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్ , కూర్పు: నందమూరి హరి, ఆర్ట్: విజయ్ కృష్ణ , పబ్లిసిటీ : సాయి సతీష్, కెమెరా: వై.గిరి, రచన: సతీష్ బండోజీ , దర్శకత్వం : ఎం.వెంకట్, నిర్మాత : నారాయణ్ రామ్

More News

విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్స్ వివరాలు

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాల‌తో న‌టుడుగా, యువ హీరోల్లో సెన్సేషనల్ స్టార్ గా స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న‌ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా.

సుకుమార్‌.. న‌న్ను నాకే కొత్త‌గా ప‌రిచయం చేశారు - రామ్‌చ‌ర‌ణ్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `రంగ‌స్థ‌లం`.

'సిల్లీ ఫెలోస్' గా అల్లరి నరేష్, సునీల్

త‌మిళంలో విజ‌యం సాధించిన 'తమిళ పడం' సినిమాని అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ జంటగా 2012లో

చెర్రీ, సుక్కు రిస్క్‌...

ఈ మ‌ధ్య కాలంలో కొన్ని సినిమాలు మిన‌హా దాదాపు అన్ని సినిమాల నిడివి ఎక్కువ అంటే రెండున్నర గంటల నిడివి మాత్ర‌మే ఉంటున్నాయి.

త‌క్కువ గ్యాప్‌లోనే వ‌స్తున్న రాజ్ త‌రుణ్‌

'ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్' చిత్రాల‌తో హ్యాట్రిక్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌.