JEE Advanced : జేఈఈ ఫలితాల్లో తెలుగు వెలుగులు.. ఫస్ట్ ర్యాంక్ సహా టాప్ 10లో ఆరుగురు మనోళ్లే
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి గాను నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఐఐటీ గౌహతి ఫలితాలు విడుదల చేసింది. రిజల్ట్స్‌లో తెలుగు విద్యార్ధులు సత్తా చాటారు. నాగర్ కర్నూలుకు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇతను 360 మార్కులకు గాను 341 మార్కులు సాధించాడు. అమ్మాయిల్లో నాయకంటి నాగ భవ్యశ్రీ టాపర్‌గా నిలిచింది. ఈమె 360 మార్కులకు గాను 298 మార్కులు సాధించింది. టాప్ 10లో ఆరుగురు తెలుగు విద్యార్ధులే కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యారు. జూన్ 4న దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షఖు 1,80,372 మంది విద్యార్ధులు హాజరవ్వగా.. వారిలో 43,773 మంది అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి నెగిటివ్ మార్కింగ్ ప్రశ్నలు తక్కువగా వుండటం వల్ల ఎక్కువ కటాఫ్‌కు అవకాశం లభించిందని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ టాప్ 10 ర్యాంకర్లు వీరే:
1. వావిలాల చిద్విలాస్ రెడ్డి
2. రమేశ్ సూర్య తేజ
3. రిషి కర్లా
4. రాఘవ్ గోయల్
5. ఆళ్లగడ్డ వెంకట శివరామ్
6. ప్రభవ్ ఖండేల్వాల్
7. బిక్కిన అభినవ్ చౌదరి
8. మలయ్ కేడియా
9. నాగిరెడ్డి బాలాజీ రెడ్డి
10. యక్కంటి ఫణి వెంకట మనీందర్ రెడ్డి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments