పవన్ కు షాక్ .. జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా
- IndiaGlitz, [Thursday,January 30 2020]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. జేడీ ఎస్ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పూర్తి జీవితం ప్రజా సేవకు మాత్రమే అని... సినిమాల్లోకి మళ్లీ వెళ్లను అని చెప్పిన పవన్ ... మళ్లీ సినిమాల్లో నటించేందుకు వెళ్లడం ద్వారా మీలో నిలకడ విధానాలు లేవని అర్దం అవుతుంది అని... అందుకే పార్టీకి రాజీనామ చేస్తున్నాను అని ప్రకటించారు.
ఈ సందర్భంగా విశాఖ పట్నం పార్లమెంట్ ఎన్నికల్లో తనతో నడిచిన ప్రతి కార్యకర్తకు , ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, పౌరులకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచే జరగాలని ఆశిస్తూ ... ఆ భగవంతుడి కృప ఎప్పుడు మీ మీద ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్నారు.