జనసేన తరఫున ఎంపీగా మాజీ జేడీ పోటీ

  • IndiaGlitz, [Tuesday,March 19 2019]

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈయన్ను విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా జనసేన అధిష్టానం ప్రకటించింది. కాగా ముందు నుంచి అనుకున్నట్లుగానే ఆయన్ను లోక్‌సభకు పోటీ చేయించాలని పవన్ ఫిక్స్ అయిపోయారు. మాజీ జేడీతో పాటు మరో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రటించింది.

శాసన అభ్యర్థులు వీరే..

విశాఖ ఉత్తరం: పసుపులేటి ఉషా కిరణ్

విశాఖ దక్షిణం : గంపల గిరిధర్
విశాఖ తూర్పు : కోన తాతారావు

భీమిలి: పంచకర్ల సందీప్

అమలాపురం : శెట్టిబత్తుల రాజాబాబు

పెద్దాపురం : తుమ్మల రామస్వామి (బాబు)

పోలవరం : చిర్రి బాల రాజు

అనంతపురం : వరుణ్

కాగా మాజీ జేడీతో జనసేనలో చేరిన ఆయన తోడల్లుడు రాజగోపాల్‌కు జనసేన పార్టీలో ఉన్నతమైన ఒక కమిటికీ చైర్మన్‌గా నియమించడం జరిగింది. కాగా తొలుత ఆయన్ను అనంతపురం నుంచి శాసనసభ స్థానం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. అయితే సమీకరణాల నేపథ్యంలో ఆయన్ను అనంత పార్లమెంట్‌కు పోటీ చేయాలని కోరగా.. శాసనసభ స్థానాన్ని టి.సి వరుణ్‌కు కేటాయించడానికి సమ్మతించి ఆయన పార్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి మొగ్గు చూపారని జనేన ఓ ప్రకటనలో పేర్కొంది.

అర్ధరాత్రి మూడో జాబితా విడుదల..

సోమవారం అర్ధరాత్రి జనసేన మూడో జాబితాను విడుదల చేసింది. దీనిలో మొత్తం ఒక లోక్‌సభ, 13 మంది అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు. విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్పు చేశారు. గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించినషేక్ రియాజ్ తాజా మార్పులో భాగంగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్ర శేఖర్ యాదవ్ పోటీ చేస్తారు.

లోక్ స‌భ అభ్యర్ధి..

ఒంగోలు - బెల్లంకొండ సాయిబాబు

శాస‌న‌స‌భ అభ్యర్ధులు..

టెక్కలి - క‌ణితి కిర‌ణ్ కుమార్

పాల‌కొల్లు - గుణ్ణం నాగ‌బాబు

గుంటూరు ఈస్ట్ - షేక్ జియా ఉర్ రెహ్మాన్

రేప‌ల్లె- క‌మ‌తం సాంబ‌శివ‌రావు

చిల‌క‌లూరిపేట - మిరియాల ర‌త్న‌కుమారి

మాచ‌ర్ల - కె. ర‌మాదేవి

బాప‌ట్ల పులుగు మ‌ధుసూధ‌న్ రెడ్డి

ఒంగోలు - షేక్ రియాజ్

మార్కాపురం - ఇమ్మడి కాశీనాధ్

More News

'లక్ష్మిస్ ఎన్టీఆర్' రిలీజ్‌కు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మిస్ ఎన్టీఆర్'.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెరకెక్కించిన 'లక్ష్మీస్ వీర గ్రంథం' సినిమాల విడుదలను ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అఖిల్‌తో కైరా...

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చారు కానీ.. మంచి స‌క్సెస్ కోసం వెయిట్ చేయాల్సి వ‌స్తుంది. అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు బాక్సాఫీస్

'లక్ష్మీస్ ఎన్టీఆర్' వాయిదా

అనుకున్న‌ట్లే అయ్యింది. దివంగ‌త నేత ఎన్టీఆర్ జీవితంలో చ‌ర‌మాంక ద‌శ‌లో ఎదుర్కొన్న రాజ‌కీయ ఆటు పోట్ల‌ను, ల‌క్ష్మీ పార్వ‌తిని పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆయ‌న జీవితంలో

బిగ్‌బాస్ 3లో నాగ్...?

హిందీ నుండి తెలుగులోకి వ‌చ్చిన తొలి రియాలిటీ షో బిగ్ బాస్‌. స్టార్ మా వారు నిర్వ‌హిస్తున్న ఈ రియాలిటీ షో ఇప్ప‌టికి రెండు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది.

తెలుగులో రీమేక్ కానున్న బాలీవుడ్ చిత్రం...

గ‌త ఏడాది అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'బ‌దాయి హో'. 30 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ  సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద స‌క్సెస్‌