జనసేన తరఫున ఎంపీగా మాజీ జేడీ పోటీ
Send us your feedback to audioarticles@vaarta.com
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈయన్ను విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా జనసేన అధిష్టానం ప్రకటించింది. కాగా ముందు నుంచి అనుకున్నట్లుగానే ఆయన్ను లోక్‌సభకు పోటీ చేయించాలని పవన్ ఫిక్స్ అయిపోయారు. మాజీ జేడీతో పాటు మరో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రటించింది.
శాసన అభ్యర్థులు వీరే..
విశాఖ ఉత్తరం: పసుపులేటి ఉషా కిరణ్
విశాఖ దక్షిణం : గంపల గిరిధర్
విశాఖ తూర్పు : కోన తాతారావు
భీమిలి: పంచకర్ల సందీప్
అమలాపురం : శెట్టిబత్తుల రాజాబాబు
పెద్దాపురం : తుమ్మల రామస్వామి (బాబు)
పోలవరం : చిర్రి బాల రాజు
అనంతపురం : వరుణ్
కాగా మాజీ జేడీతో జనసేనలో చేరిన ఆయన తోడల్లుడు రాజగోపాల్‌కు జనసేన పార్టీలో ఉన్నతమైన ఒక కమిటికీ చైర్మన్‌గా నియమించడం జరిగింది. కాగా తొలుత ఆయన్ను అనంతపురం నుంచి శాసనసభ స్థానం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. అయితే సమీకరణాల నేపథ్యంలో ఆయన్ను అనంత పార్లమెంట్‌కు పోటీ చేయాలని కోరగా.. శాసనసభ స్థానాన్ని టి.సి వరుణ్‌కు కేటాయించడానికి సమ్మతించి ఆయన పార్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి మొగ్గు చూపారని జనేన ఓ ప్రకటనలో పేర్కొంది.
అర్ధరాత్రి మూడో జాబితా విడుదల..
సోమవారం అర్ధరాత్రి జనసేన మూడో జాబితాను విడుదల చేసింది. దీనిలో మొత్తం ఒక లోక్‌సభ, 13 మంది అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు. విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్పు చేశారు. గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించినషేక్ రియాజ్ తాజా మార్పులో భాగంగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్ర శేఖర్ యాదవ్ పోటీ చేస్తారు.
లోక్ సభ అభ్యర్ధి..
ఒంగోలు - బెల్లంకొండ సాయిబాబు
శాసనసభ అభ్యర్ధులు..
టెక్కలి - కణితి కిరణ్ కుమార్
పాలకొల్లు - గుణ్ణం నాగబాబు
గుంటూరు ఈస్ట్ - షేక్ జియా ఉర్ రెహ్మాన్
రేపల్లె- కమతం సాంబశివరావు
చిలకలూరిపేట - మిరియాల రత్నకుమారి
మాచర్ల - కె. రమాదేవి
బాపట్ల పులుగు మధుసూధన్ రెడ్డి
ఒంగోలు - షేక్ రియాజ్
మార్కాపురం - ఇమ్మడి కాశీనాధ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout