‘హిప్పీ’ ఇంటర్వ్యూలో ఫ్యాంట్ విప్పేసిన జేడీ!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవంశీ నటీనటులుగా కలైపులి ఎస్ థాను సమర్పణలో వి క్రియేషన్స్ పతాకంపై తమిళ దర్శకుడు టిఎన్ కృష్ణ తెరకెక్కించిన లవ్ ఎంటర్టైనర్ చిత్రం ‘హిప్పీ’. జూన్ 6న థియేటర్లలోకి ‘హిప్పీ’ రానుంది. అయితే చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్లు ఓ రేంజ్లో చేసేస్తోంది. అందరూ ప్రమోట్ చేస్తున్నట్లుగా మనమూ చేస్తే అందులో కొత్తదనం ఏముంటుందని మరీ బోల్డ్‌గా వెళ్లిపోతున్నారు. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో హీరో కార్తికేయ.. సినిమాలో కీలకపాత్ర పోషించిన జేడీ చక్రవర్తి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే యాంకర్ మాత్రం అసలు ‘హిప్పీ’ అంటే అర్థమేంటో చెప్పాలని ఆఖరున అడగ్గా.. కార్తికేయ షర్ట్ విప్పగా.. జేడీ ఏకంగా ఫ్యాంట్ విప్పేశాడు. వామ్మో.. ఈ సీన్ చూసిన పగలబడి నవ్వుకున్నారు.. మరికొందరు అసహానానికి లోనయ్యారు.
అసలేం జరిగింది..!
‘హిప్పీ’ ప్రమోషన్స్‌లో బిజిబిజీగా ఉన్న చిత్రబృందం తాజాగా ఇందుకు సంబంధించి ఓ ప్రమోషన్ వీడియోను విడుదల చేశారు. ఓ కాఫీ షాప్‌లో యాంకర్ హేమంత్‌తో ఇంటర్వ్యూ ముగించుకుని కార్తీకేయ, జేడీ చక్రవర్తి బయటికి వస్తుండగా ఓ సన్నివేశం జరిగింది. దీంతో జనాలంతా ఒకింత అవాక్కయ్యారు. అసలేం జరిగిందంటే.. ఇంటర్వ్యూ పూర్తయిపోయింది.. అయితే అడగాల్సిన ప్రశ్న అడగకుండా చివర్లో యాంకర్ అడిగాడు. అదేంటంటే.. ‘సర్.. సర్.. సర్ ఒక్క క్వచ్ఛన్ అడగడం మరిచిపోయా.. ఇంతకీ హిప్పీ అంటే ఏంటి సార్..? సార్.. మీరు ఈ ప్రశ్నకు మాటల్లో కాదు.. చేతల్లో చేసి సమాధానం చెప్పండి అని యాంకర్ అడగ్గా.. అటు కార్తికేయ.. ఇటు జేడీ ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
ఒకరు షర్ట్.. ఇంకొకరు ఫ్యాంట్..!
యాంకర్ ప్రశ్నకు చేతల్లో...:- కార్తికేయ తన ఒంటి మీదున్న షర్ట్ విప్పేయగా.. జేడీ మాత్రం ఏకంగా తన ఫ్యాంట్‌ను విప్పేసి.. అండర్ వేర్‌తో నిలబడి..‘దిస్ ఈజ్ హిప్పీ’ అని షాక్ ఇచ్చారు. ఈ సీన్‌తో అటు యాంకర్‌తో పాటు.. కాఫీ షాప్‌లో ఉన్న అమ్మాయిలు సైతం కంగుతిన్నారు. ఈ సీన్‌తో కొందరు జనాలు నవ్వుకుని లైట్ తీసుకున్నప్పటికీ.. ఇదంతా కాస్త ఓవర్ అనిపించడం లేదా సార్.. అసలు ఇది ప్రమోషన్ వీడియోనా లేకుంటే అడల్ట్ వీడియోనా అంటూ కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు.. జేడీకి వయసు పెరిగింది కానీ.. ఆయన వయసుకు తగ్గట్లు పనులు చేయట్లేదు.. దిస్ ఈజ్ టూ మచ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com