JD Chakravarthy:నివృతి వైబ్స్ నుంచి ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ పాటను రిలీజ్ చేసిన జేడీ చక్రవర్తి

  • IndiaGlitz, [Wednesday,May 17 2023]

ప్రస్తుతం నివృతి వైబ్స్ నుంచి వస్తోన్న పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. జానపద పాటలకు నివృతి వైబ్స్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అత్యుత్త‌మ‌మైన ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో ఆడియో, విజువ‌ల్ కంటెంట్‌ను అందించ‌టంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు తానే బెస్ట్ అనిపించుకుంటూ ఈ సంస్థ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. గ‌డిచిన రెండేళ్ల‌లో తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో నివృతి సంస్థ 50కి పైగా మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించింది. వీటిలో జ‌రీ జ‌రీ పంచెక‌ట్టి, గుంగులు, సిల‌క ముక్కుదానా, జంజీరే, వ‌ద్ద‌న్నా గుండెల్లో సేరి వంటి పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. ఇప్పుడు ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అనే పాటను వర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. 'నివృతి అంటే సంతోషం అని అర్థం. జయతి గ్యాప్ తీసుకోవడం వల్లే ఈ పాట చేయగలిగింది. పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కాకుండా.. డ్యాన్స్‌ చేస్తున్న జయతిని చూడటమే విశేషం. భీమ్స్, కాసర్ల శ్యాంలకు పెళ్లి అయింది కాబట్టి అంత కసిగా కొట్టారు. ఈ పాట పెద్ద హిట్ అయి.. పెళ్లి జరిగితే అయ్యే లొల్లి ఏంటో పార్ట్ 2గా తీయాలని కోరుకుంటున్నాను. ఒక్క పాట కోసం ఇంతగా ఖర్చు పెడతారా? అని అనుకున్నాను. ఖర్చు పెడితే కూడా డబ్బులు వెనక్కి వస్తాయని వారి లాజిక్. ఇక్కడకు నన్ను పిలిచినందుకు నివృతి వైబ్స్‌కు థాంక్స్' అని అన్నారు.

జయతి మాట్లాడుతూ.. 'గత నెలలో నివృతి వైబ్స్ నుంచి ఓ పాట వచ్చింది. ఆ ఈవెంట్‌కు నేను గెస్టుగా వచ్చాను. లాంచ్ సాంగ్‌ చేయడానికి పిలిచిన వెంటనే వచ్చిన జేడీ గారికి థాంక్స్. వీజేగా నేను చాలా ఏళ్లుగా పని చేశాను. రెండేళ్లు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత సినిమాను నిర్మించి, హీరోయిన్‌గానూ చేశాను. మళ్లీ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇలా పాటతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాను. భీమ్స్, కాసర్ల శ్యామ్ మంచి లిరిక్స్ ఇచ్చారు. శ్రావణ భార్గవి చక్కగా పాడారు. ఈ పాటను ఎవరి ద్వారా విడుదల చేయాలని అనుకున్నాను. అప్పుడే నాకు నివృతి వైబ్స్, ప్రియా గారు పరిచయం అయ్యారు. ఈ పాటను ఇంత గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నందుకు ప్రియా గారికి థాంక్స్. లచ్చి సినిమాలో రామ్ ప్రసాద్‌తో కలిసి నటించాను. ఈ పాట కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్' అని అన్నారు.

రాం ప్రసాద్ మాట్లాడుతూ.. 'నివృతి వైబ్స్‌కు థాంక్స్ చెప్పుకోవాల్సిందే. సినిమా పాటలకు ధీటుగా తీస్తున్నారు. జయతి గారు వెన్నెల ప్రోగ్రాంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఈ పాట నాకు చాలా నచ్చింది. జయతి గారికి ఈ పాట రీ లాంచ్‌లా ఉండాలి. నా మొదటి సినిమా జోష్. అందులోనే జేడీ గారితో పరిచయం ఏర్పడింది. ఈ పాటను అందరూ చూసి విజయవంతం చేయండి' అని అన్నారు.

బాలు మాట్లాడుతూ.. 'ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌లకు నివృతి వైబ్స్ చాలా మంచి ఫ్లాట్‌ఫాం. ప్రశాంత్, ప్రియలకు థాంక్స్. జయతి గారికి కంగ్రాట్స్. నివృతి వైబ్స్‌కు థాంక్స్' అని అన్నారు.

కొరియోగ్రఫర్ షష్టి మాట్లాడుతూ.. 'అందరికీ మంచి అవకాశాలు ఇస్తున్న నివృతి వైబ్స్‌కు థాంక్స్. మానస్, విష్ణుప్రియలతో పని చేయడం ఆనందంగా ఉంది. ప్రియ మేడంకు థాంక్స్. జయతి గారు ఈ పాటలో చాలా అందంగా కనిపిస్తున్నారు. గంగులు పాట లాంచ్‌కు రాలేకపోయినందుకు సారీ' అని అన్నారు.

ఆక్సా ఖాన్ మాట్లాడుతూ.. 'నివృతి వైబ్స్ అంటే నాకు ఫ్యామిలీలాంటిది. ప్రియ గారు పిలిచిన వెంటనే షూటింగ్‌ను పక్కన పెట్టేసి వచ్చాను. జేడీ సర్‌కు స్వాగతం. జయతి గారి సాంగ్ బాగుంది. ఎంతో చక్కగా పర్ఫామ్ చేశారు. ఈ సాంగ్ మున్ముందు మరింతగా హిట్ అవుతుంది. ప్రియా గారు చాలా మంచి వ్యక్తి. మళ్లీ మళ్లీ వారితో పని చేయాలని ఉంది' అని అన్నారు.