నక్షత్రంలో జె.డీ.చక్రవర్తి..!
Saturday, January 21, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం నక్షత్రం. ఈ చిత్రంలో సందీప్ కిషన్ - రెజీనా జంటగా నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, ప్రగ్యాజైస్వాల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పోలీసు అవ్వాలనుకునే ఓ యువకుడి కథగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందట. ఈ కీలకపాత్రను జె.డి.చక్రవర్తి పోషిస్తున్నారు. గులాబి చిత్రంతో కృష్ణవంశీ దర్శకుడుగా పరిచయం కావడం...ఆ చిత్రం సంచలనం సృష్టించడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రంలో జె.డి.చక్రవర్తి కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం
ఈ చిత్రంలో నటిస్తున్న ఆర్టిస్టుల ఒక్కొక్క మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తున్న కృష్ణవంశీ జె.డి.చక్రవర్తి గురించి కూడా మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నక్షత్రం చిత్రాన్ని మార్చిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments