జేసీ.. మోదీ భజన..బాబుపై షాకింగ్ కామెంట్స్.. హలో అంతే!

  • IndiaGlitz, [Saturday,September 14 2019]

టీడీపీ కీలక నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రధాని మోదీ భజన మొదలుపెట్టారు. అంతేకాదు.. మోదీని ఆకాశానికెత్తేసి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలైంది. ఆ ప్రభంజనం ఎక్కువైనా కావచ్చు.. లేదా తక్కువైనా కావచ్చు. ఇందులో ప్రతిపక్ష నేత చంద్రబాబు పరోక్షపాత్ర ఉంది. చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో బీజేపీ ఆధారపడి ఉంది. మోదీ ఆలోచనలపై ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయి. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా నడుస్తోందని.. ఆ హవాతోనే ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీలోకి వెళుతున్నారు. కొందరు టీడీపీ నేతలు కూడా అలాగే బీజేపీలో చేరారు. చంద్రబాబు చేసిన కొన్ని తప్పులు, మోదీ ప్రవేశపెట్టిన పథకాలు కారణం’ అని జేసీ అభిప్రాయపడ్డారు.

జమిలీ ఎన్నికలపై..
‘జమిలీ ఎన్నికలపై కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు తట్టుకొని నిలబడటం, మనుగడ కొనసాగించడం కష్టమే. బీజేపీపై వ్యాఖ్యలు చేసినంత మాత్రాన నేను ఆ పార్టీలో చేరబోతున్నట్లు కాదు. బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి నన్ను కలిసి మాట్లాడారు. హాయ్ చెప్పారు అంతే.. అలాగని నేను పార్టీ మారుతున్నట్లు కాదు’ అని జేసీ చెప్పుకొచ్చారు.

కాగా.. ఇటీవలే జగన్ 100 రోజుల పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దివాక‌ర్‌రెడ్డి.. ఇప్పుడు మోదీని ఆకాశానికి ఎత్తేయడం, చంద్రబాబు తప్పులు చేశారనడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి చూస్తే జేసీ పార్టీ మారడం దాదాపు ఖాయమని దీన్ని బట్టి తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

జగన్ పాలనపై ‘జనసేన’ నివేదిక.. రియాక్షన్ ఉంటుందా!

వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి 100రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదిక విడుదల చేసింది. శనివారం నాడు అమరావతి వేదికగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నివేదిక విడుదల చేశారు.

ఇద్ద‌రం ఒకే వేదిక పైన అవార్డులు తీసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది - జ‌య‌సుధ‌

విబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే.

సెన్సార్ సభ్యుల ప్రశంసలు పొందిన 'రథేరా'

పూల సిద్దేశ్వర రావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం రథేరా. జాకట్ రమేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పూల సిద్దేశ్వర రావు,

'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌' చిత్రాన్ని ఓన్‌ చేసుకొని మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ - నాని

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన

పి.వి.సింధుని చూసి గ‌ర్వ‌ప‌డున్నాం:  నాగార్జున అక్కినేని

ఇటీవ‌ల జ‌రిగిన వ‌రల్డ్ బ్యాడ్మింట‌న్ పోటీల్ జ‌పాన్‌కు చెందిన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌ నొజొమి ఒకుహ‌రను ఫైన‌ల్లో ఓడించి వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌గా నిలిచిన తెలుగు తేజం పి.వి.సింధు.