యాంకర్ జయతి ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం లచ్చి..

  • IndiaGlitz, [Wednesday,April 06 2016]
వెన్నెల ప్రొగ్రామ్ ద్వారా పాపుల‌ర్ అయిన యాంక‌ర్ జ‌య‌తి క‌ధానాయిక‌గా న‌టిస్తూ...నిర్మిస్తున్న చిత్రం ల‌చ్చి. ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ ఈశ్వ‌ర్ తెర‌కెక్కిస్తున్నారు.ఈ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో యాంక‌ర్ ట‌ర్న‌డ్ హీరోయిన్ జ‌య‌తి మాట్లాడుతూ.. ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ట్ చేసి మంచి చిత్రాలు నిర్మించాల‌నేది నా కోరిక‌. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన మై బాస్ అనే సినిమా నాకు బాగా న‌చ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని రైట్స్ తీసుకున్నాను. ఈ సినిమా చేద్దాం అనుకుంటున్న స‌మ‌యంలో డైరెక్ట‌ర్ ఈశ్వ‌ర్ ఓ క‌థ చెప్పారు. ఈ క‌థ నాకు న‌చ్చ‌డంతో ముందు ఈ సినిమా ప్రారంభించాం.
ఈ సినిమాలో నేను న‌టించాల‌నుకోలేదు. ఇందులో క్యారెక్ట‌ర్ న‌న్ను బాగా ఆక‌ట్టుకుంది. మా డైరెక్ట‌ర్ కూడా మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. స‌రే అని న‌టించాను. ప‌ల్లెటూరులో జ‌రిగే విభిన్న క‌థా చిత్ర‌మిది. ఈ సినిమా టైటిల్ ల‌చ్చి. ఇది థ్రిల్లింగ్ కామోడీ హ‌ర్ర‌ర్ మూవీ. య‌ధార్ధ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. జ‌య 9 ఫోర్ షోస్ అనే బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా కోసం తిరుప‌తిలో షూటింగ్ చేసాం. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. వ‌చ్చే వారంలో ల‌చ్చి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్ష‌కులు న‌న్ను హీరోయిన్ గా ఆద‌రిస్తే న‌టిగా కంటిన్యూ అవుతాను. లేక‌పోతే నిర్మాత‌గా మంచి సినిమాలు నిర్మిస్తాను అన్నారు.

More News

'24' చిత్రం నాకు మంచి బ్రేక్ ఇస్తుంది - అజయ్

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలను పోషించిన నటుడు అజయ్.

కుమారి దర్శకుడితో శర్వానంద్..

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ ఉన్న శర్వానంద్

తెలుగులో కీర్తి సురేష్ ఆ హీరోతో నటిస్తుందా..

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్.

'కబాలి' ఆలస్యమవుతాడా?

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు రెండు సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందులో ఇకటి పా రంజిత్ దర్శకత్వంలో కబాలి చిత్రం కాగా రెండో చిత్రం శంకర్ దర్శకత్వంలో 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. అయితే ఈ రెండు చిత్రాల్లో కబాలిని మే 1న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు.

సర్దార్ ను ప్రేక్షకుడు అంతసేపు భరిస్తాడా?

ఇప్పుడు ప్రేక్షకుల ట్రెండ్ కు అనుగుణంగానే సినిమాల రన్ టైం కూడా డిసైడ్ అవుతుంది. ఒకప్పుడు సినిమా మూడు నాలుగు గంటల నిడివి ఉండేది. ఇప్పుడది కాస్తా రెండు గంటలకు చేరింది. రెండు గంటలు దాటిందంటేనే ప్రేక్షకుడు సినిమా లెంగ్త్ ఎక్కువైందని భావిస్తున్నాడు.