'జయసూర్య' మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Friday,September 04 2015]

మాస్ సినిమాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల విశాల్ చేసిన ఇంద్రుడు, పల్నాడు సినిమాలను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది. అదే తరహాలో పల్నాడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సుసీంద్రన్ దర్శకత్వంలో చేసిన సెకండ్ మూవీ జయసూర్య(తమిళంలో పాయుమ్ పులి). తెలుగులో విశాల్ కి మంచి మార్కెట్ ఉండటంతో తెలుగు, తమిళంలో ఓకేసారి సినిమాని విడుదల చేశారు. రిలీజ్ కు ముందు వరకు అనేక సమస్యలను ఎదుర్కొని ఎట్టకేలకు జయసూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ జయసూర్య ఎలా ఆకట్టుకున్నాడో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం..

కథ

వైజాగ్ సిటీలో వ్యాపారస్థులను భవాని అతని మనుషులు డబ్బు కోసం బెదిరించి, ఎదురు తిరిగిన వారిని చంపేస్తుంటాడు. వారికి ఎదురు తిరిగిని అల్బర్ట్ అనే ఇన్ స్పెక్టర్ ని భవాని చంపేసి కోర్టులో లొంగిపోతాడు. అలాంటి సమయంలో వైజాగ్ లోకి పోలీస్ డ్యూటీ జాయిన్ కావడానికి జయసూర్య(విశాల్) వస్తాడు. రావడంతోనే రౌడీలను కలిసి వారి లాభాల్లో వాటాలు అడగటం మొదలు పెడతాడు. అలాగే వారిని ఎవరికీ డౌట్ రాకుండా ఎన్ కౌంటర్ చేసేస్తుంటాడు. తన మనుషులను ఎవరు చంపుతున్నారో తెలియని భవాని జైలు నుండి విడుదలైన సమయంలో దీనికి కారణం జయసూర్య అని తెలుస్తుంది. అతన్ని చంపడానికి జయసూర్య ప్రేమించే అమ్మాయి(కాజల్ అగర్వాల్)ని ఎత్తుకొచ్చేస్తాడు. అప్పుడు జయసూర్య భవానిని చంపేసి అక్కడకొచ్చిన పోలీసులకు తాను అండర్ కవర్ పోలీస్ నని అల్బర్ హత్యకు ప్రతీకారంగా కమీషనర్ అదేశాల మేర ఈ పనులు చేస్తున్నానని చెబుతాడు. అయితే సిటీలో హత్యలు ఆగవు. ఆ హత్యలకు కారణాలేంటనేది పోలీసులకు పెద్ద మిస్టరీగా మారుతుంది. దాంతో కమీషనర్ ఆ కేసును జయసూర్యకే అప్పగిస్తాడు. జయసూర్య రంగంలోకి దిగి కేసుని చేధించుకుంటూ వస్తాడు. మరి కేస్ లో జయసూర్యకి తెలిసే నిజం ఏమిటి? అసలు ఆ హత్యలకు కారణం ఎవరు? మరి జయసూర్య హత్యలకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాడనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

సమీక్ష

విశాల్ బాడీ లాంగ్వేజ్ కి, లుక్ కి తగిన విధంగా సుసీంద్రన్ తయారు చేసుకున్న పవర్ ఫుల్ పోలీస్ స్టోరీలో ఒదిగిపోయాడు. అండర కవర్ పోలీస్ గా విశాల్ ఆద్యంతం హై ఎనర్జీతో నటించాడు. ఫైట్స్ ఇరగదీశాడు. ముఖ్యంగా క్లయిమాక్స్ ఫైట్ ఓ వైపు యాక్షన్, మరో వైపు సెంటిమెంట్ చూపిస్తూ లో సముద్రఖనితో చేసే ఫైట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. కాజల్ అగర్వాల్ నటనకు పెద్దగా స్కోప్ లేదు. పాటలకు పరిమితం అయింది. అక్కడక్కడా మెరిసిందంతే. చెప్పుకోవాల్సింది సముద్రఖని గురించి విలన్ గా ఆయన నటన ఎక్సలెంట్. ఓ వైపు మంచివాడు నటిస్తూనే చెడ్డపనులు చేసే విలన్ గా చక్కగా నటించాడు. కమెడియన్ సూర్య కామెడి పెద్దగా నవ్వించలేదు. జయప్రకాష్, హరీష్ ఉత్తమ్, మురళీ శర్మలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్టర్ సుసీంద్రన్ సినిమా కథను చక్కగా రాసుకోవడమే కాకుండా దానికి సెంటిమెంట్, ఎమోషన్స్ జోడించి చక్కగా తెరకెక్కించాడు. ముఖ్యంగా క్లయిమాక్స్ సన్నివేశం ఆడియెన్స్ ను హత్తుకునేలా డైరెక్ట్ చేశాడు. థ్రిల్లింగ్ మూమెంట్స్ ను ఎక్కడా డ్రాప్ కాకుండా చివరి వరకు మెయిన్ చేసేలా కథను ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇమాన్ సంగీతంలో తెలుగుదనమా.. , వస్తవా.. అనే సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా చక్కగా ఇచ్చాడు. ముఖ్యంగా పులి పులి.. అంటూ వచ్చే సాంగ్ చాలా బావుంది. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ స్టయిల్ తో ప్రతి సీన్ ను రిచ్ గా తెరకెక్కించాడు. ఆంటోని ఎడిటింగ్ బావుంది. అయితే డైరెక్టర్ మొత్తం తన దృష్టిని యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించడంలో పెట్టిన శ్రద్ధ కొంత కామెడిపై పెట్టుంటే బావుండేది. ఇక్కడొక విషయ చెప్పాలి. సీరియస్ గా సాగే కథలో కామెడి ఇమడనుకున్నాడేమో. విశాల్, సూర్య మధ్య వచ్చే కామెడి పార్ట్, విశాల్, కాజల్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకోదు.

విశ్లేషణ

విశాల్ కెరీర్ లో మరో మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా జయసూర్య నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. దర్శకుడు సుసీంద్రన్ సినిమాని థ్రిల్లింగ్ మూమెంట్స్ తో ఆద్యంతం ఆసక్తిగా నడిపించాడు. ఇమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా ప్లస్ అయింది. సముద్రఖని తన తండ్రితో నాకు ఓటు వేసిన ఎనభై వేల మంది నాలాగా అమాయకులు. నా కోపమంతా నాకు వ్యతిరేకంగా ఓటు వేసిన రెండు లక్షల మందిపైనే అని చెప్పే డైలాగ్, విశాల్ సముద్రఖని వెంబడించే సన్నివేశం, క్లయిమాక్స్ ఫైట్, థ్రిల్లింగ్ గా సాగే ఎలిమెంట్స్ సినిమాని ఆసక్తిగా ముందుకు నడిపించాయి. ఫస్టాఫ్ లో కొద్దిగా నెమ్మదిగా నడుస్తుంది. కానీ సెకండాఫ్ లో మాత్రం సినిమా చాలా స్పీడ్ గా సాగిపోతుంది.

బాటమ్ లైన్: జయసూర్య' ఎమోషన్ యాక్షన్ ఎంటర్ టైనర్

రేటింగ్: 3/5

More News

'భలే భలే మగాడివోయ్' మూవీ రివ్యూ

‘ఈరోజుల్లో’ సక్సెస్ తో తొలి సక్సెస్ అందుకున్న మారుతి తర్వాత ‘బస్ స్టాప్’ తో రెండో హిట్ కూడా అందుకున్నాడు. అయితే అంతే రేంజ్ లో తనపై విమర్శలు కూడా వచ్చాయి. దాంతో స్టయిల్ మార్చి ‘ప్రేమకథాచిత్రమ్’ తో సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత వచ్చిన ‘కొత్త జంట, లవర్స్’ మంచి విజయాలు సాధించిన మారుతి అనుకున్న స్థాయి విజయాలను మాత్రం తెచ్చిపెట్టలేదు.

విష్ణు ఆ..డైరెక్టర్ తో సినిమా చేస్తున్నడా....?

మంచు విష్ణు తాజా చిత్రం డైనమేట్ రిలీజ్ అయ్యిందో లేదో...అప్పుడే తన తదుపరి చిత్రం ప్రారంభోత్సవం చేయడానికి రెడీ అవుతున్నాడు.

విష్ణు, జె.డి మధ్య మాటల్లేవ్..

మంచు విష్ణు హీరోగా దేవ కట్టా తెరకెక్కించిన చిత్రం డైనమేట్.ఈ చిత్రం ఈ నెల 4న రిలీజ్.ఈ చిత్రంలో విష్ణు హీరోగా నటించగా, జె.డి విలన్ గా నటించారు.

తెలుగులో పాటలు పాడునున్న 'పులి'

‘కత్తి’ చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ గా చింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై శిబు తమీన్స్, పి.టి.స్వెకుమార్ నిర్మిస్తోన్న చిత్రం ‘పులి’.

'గుంటూరు టాకీస్' ఆడియో రిలీజ్ డేట్...

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూర్ టాకీస్’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్ విజయ్కృష్ణ, రేష్మీ గౌతమ్, శ్రద్ధాదాస్, లక్ష్మీ మంచు, మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా నటించారు.