మణిరత్నం చిత్రంలో సహజనటి
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నో తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన సహజనటి జయసుధ భర్త మరణం తర్వాత మరే సినిమాలో నటించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఓ తమిళ సినిమాలో నటించబోతుంది. ఆ సినిమా మరేదో కాదు..మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం.
`చెలియా` సినిమా మణిరత్నంను నిరాశపరిచింది. అయితే ఇప్పుడు మణిరత్నం ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే తలంపుతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. ఇందులో శింబు, అరవింద్ స్వామి, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతిల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కించనున్నారు.
జ్యోతిక మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పుడు జయసుధ కూడా నటించబోతున్నారు. మణిరత్నం సినిమా కాబట్టే జయసుధ నటిండచానికి ఆసక్తిగా ఉందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com