మణిరత్నం చిత్రంలో సహజనటి

  • IndiaGlitz, [Tuesday,November 14 2017]

ఎన్నో తెలుగు చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించిన స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత మ‌రే సినిమాలో న‌టించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఓ త‌మిళ సినిమాలో న‌టించ‌బోతుంది. ఆ సినిమా మ‌రేదో కాదు..మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న కొత్త చిత్రం.

'చెలియా' సినిమా మ‌ణిర‌త్నంను నిరాశ‌ప‌రిచింది. అయితే ఇప్పుడు మ‌ణిర‌త్నం ఎలాగైనా స‌క్సెస్ కొట్టాల‌నే త‌లంపుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేశారు. ఇందులో శింబు, అరవింద్‌ స్వామి, ఫహాద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతిల కాంబినేషన్‌ లో ఓ సినిమా తెరకెక్కించనున్నారు.

జ్యోతిక మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఇప్పుడు జ‌య‌సుధ కూడా న‌టించ‌బోతున్నారు. మ‌ణిర‌త్నం సినిమా కాబ‌ట్టే జ‌య‌సుధ న‌టిండ‌చానికి ఆస‌క్తిగా ఉంద‌ని స‌మాచారం.