'మా' కోసం జయసుధ..?
- IndiaGlitz, [Thursday,September 06 2018]
కొన్ని రోజుల నుండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో నిధులు దుర్వినియోగం అనే విషయం రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఢల్లాస్లో జరిగిన ఈవెంట్‌కు చిరంజీవి హాజరైనప్పుడు వచ్చిన నిధులు పక్కదారి పట్టాయనేది జనరల్ సెక్రటరీ నరేశ్ వాదన. అయితే అలాంటిదేం లేదనేది శివాజీరాజా, శ్రీకాంత్ వర్గం వాదన. మా పేరు ఖరాబు అయిపోయిన నేపథ్యంలో దీనికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే వ్యక్తి ఎవరనే దానిపై పరిశ్రమ పెద్దలు ఆలోచిస్తున్నారట.
అందులో జయసుధ పేరు ప్రముఖంగా వినపడుతుంది. గతంలో రాజేంద్ర ప్రసాద్‌తో మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడి ఓడిపోయిన జయసుధ తర్వాత మా కు దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఆమె ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఉండాలనుకుంటుంది. ఇప్పుడు ఆమెను అధ్యక్ష పదవిలో కూర్చొమని అడిగితే ఒప్పుకుంటుందా? అనేది సందేహంగా మారింది.