జయరామ్ కేసులో విస్తుపోయే నిజాలు చెప్పిన మేనకోడలు!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ చౌదరి హత్యకేసులో విస్తుపోయే నిజానిజాలు వెలుగుచూశాయి. చౌదరి హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే చేధించారు. మొదట ఆయన కుటుంబీకులను, డ్రైవర్‌ను విచారించిన పోలీసులు మేనకోడలను విచారించగా సంచలన నిజాలు బయటపెట్టింది. అసలు ఆమె పోలీసుల విచారణలో ఏం చెప్పింది..? రాకేశ్ రెడ్డి ఎవరు..? మధ్యలో శ్రీకాంత్ రెడ్డి ఎందుకొచ్చాడు..? నిజంగా చౌదరికి శిఖాకు వివాహేతర సంబంధం ఉందా..? ఆయన శిఖాను లైంగికంగా వేధించారా..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నాకు రెండు పెళ్లిళ్లు అయ్యాయ్ నిజమే..!
"చిగురుపాటి జయరామ్ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు రెండు పెళ్లుల్లు అయ్యాయి. ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నాను. నేను రాకేశ్ ఇద్దరం ఒకప్పుడు లవర్స్. అతనితో డేటింగ్ చేశాను. రెండో భర్తను వదిలివేయడానికి అతనే కారణం. రెండో భర్తతో బ్రేకప్ అయ్యాక రాకేష్ రెడ్డిని పెళ్లి చేసుకుందామనుకున్నాను. కానీ జయరామ్ వల్ల అతనికి దూరం కావాల్సి వచ్చింది. జయరామ్‌కి రాకేష్‌రెడ్డిని నేనే పరిచయం చేశాను. రాకేష్‌కి సొంత వ్యాపారాలేవీ లేవు. పెద్దపెద్ద వ్యక్తుల వద్ద రాకేష్ పనిచేశాడు" అని శిఖా చెప్పుకొచ్చింది.
అప్పు చేసింది నిజమే..!
"జయరామ్‌కు రాకేశ్ నాలుగున్నర కోట్లు అప్పుగా ఇచ్చాడు. చెక్ పవర్ జయరామ్ భార్య చేతిలో ఉంది. ఈ కారణంగా ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చాలా మంది వద్ద అప్పులు చేశాడు. రాకేష్ వద్ద తీసుకున్న డబ్బు సకాలంలో చెల్లించకపోవడంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అయితే జయరామ్‌ను రాకేష్ చంపుతాడని అనుకోలేదు.
తరచూ నా విల్లాకి జయరామ్ వస్తుండటంతో రాకేష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఒకసారి మేమిద్దరం ఇంట్లో ఉండగా రాకేష్ వచ్చి మావయ్యతో గొడవ పడ్డాడు. డబ్బుల విషయంలో కూడా తరచూ గొడవలు పడ్డాడు. ఆ తర్వాత మావయ్య వల్లే రాకేశ్‌కు నేను దూరమయ్యాను. రాకేష్ మా ఇద్దరి మీదా కోపం పెంచుకున్నాడు. ఒక రోజు రాకేష్ నా విల్లాకు వచ్చి గ్లాస్ టేబుళ్లు పగలగొట్టాడు. రాకేష్‌తో గొడవులు జరుగుతున్న సమయంలోనే శ్రీకాంత్ పరిచయం అయ్యాడు" జయరామ్ మేనకోడలు చెప్పింది.
నేను లాంగ్ డ్రైవ్‌లో ఉన్నా..!
"హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అదే రోజున నేను, శ్రీకాంత్ వికారాబాద్ లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాము. ఉదయం ఆరు గంటలకి నా తల్లి ఫోన్ చేసి మావయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పింది. ఆ తర్వాత నేను, శ్రీకాంత్ కలిసి జయరామ్ ఇంటికి వెళ్లి నాకు రాసిచ్చిన పదెకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం వెతికాము. ఆ తర్వాత జయరామ్‌ను చూడ్డానికి విజయవాడ వెళ్లాను. అప్పుడే బెజవాడ పోలీసులు నన్ను రమ్మని ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లాను" అని ఆమె స్పష్టం చేసింది.
మావయ్య మంచోడు కాదు..!
"మావయ్య జయరామ్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాదు. నాతోపాటు నా సోదరిని కూడా లైంగికంగా వేధించారు. నా పేరున జయరాం కొన్న పది ఎకరాల భూమి డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. జయరాంను నేను చంపలేదు. ఈ ల్యాండ్ డాక్యుమెంట్ల కోసం ఓ యువతిని ఎరవేసిన మాట నిజమే. డాక్యుమెంట్ల కోసం జయరాం ఇంటికి వెళ్లటం వాస్తవమే. అయితే జయరాంను రాకేష్ ఏం చేశాడో తెలియదు" అని శిఖా పోలీసుల విచారణలో వెల్లడించింది.
నా భర్తను ఎవరు హత్య చేశారో తేల్చండి..!
"నాకు.. నా పిల్లలకు రక్షణ కల్పించండి. ఇండియాలో ఏం జరుగుతుందో నాకు ఏమీ తెలియదు" అని జయరాం భార్య పద్మశ్రీ పోలీసులను వేడుకుంది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడిన పోలీసులు వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఎస్‌ఐతో పాటు ఇద్దరు పోలీసులు, న్యాయవాది సమక్షంలో పద్మశ్రీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. "నాకు ఎవరిపై అనుమానం లేదు. నా భర్తను ఎవరు హత్య చేసారో.. ఎందుకు హత్య చేసారో తేల్చండి" అని ఏపీ పోలీసులను పద్మశ్రీ కోరింది.
కాగా ప్రస్తుతం రాకేశ్ రెడ్డిని జగ్గయ్యపేటలో ఓ గెస్ట్ హౌస్‌లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకూ శిఖా ఎపిసోడ్ ముగిసింది. అయితే రాకేశ్ ఏం చెప్పబోతున్నాడు..? ఏమేం సంచలనాలు నిజాలు వెల్లడించనున్నాడు..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి చూస్తే మూడు రోజులుగా గంటకో ట్విస్ట్.. వెలుగు చూసింది. ఈ కేసులో మొత్తం వ్యవహారం మరో 24 గంటల్లో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com