'జయమ్మునిశ్చయమ్మురా' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీనివాస్‌రెడ్డి- పూర్ణ జంటగా శివరాజ్ ఫిలింస్ పతాకంపై.. స్వీయ నిర్మాణంలో శివరాజ్ కనుమూరి రూపొందిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా` నవంబర్ 25న విడుదల కానుంది. సమైక్యంగా నవ్వుకుందాం` అనే ట్యాగ్‌లైన్‌తో.. దేశవాళి ఎంటర్‌టైన్‌మెంట్` అనే నినాదంతో సందడి చేస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ సంపాదించుకుంది. దర్శకుడు శివరాజ్ కనుమూరి రెండో సినిమాను సుకుమార్ రైటింగ్స్‌లో చేయనున్నాడు. సంగీత దర్శకులు రవిచంద్ర-కార్తీక్ రోడ్రెజ్ అందించిన ఆడియో నవంబర్ 13న విడుదల కానుంది. గీతాంజలిలో శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలో నటించాడు. తర్వాత శ్రీనివాసరెడ్డి పూర్తిస్థాయి హీరోగా నటిస్తున్న చిత్రం `జయమ్మునిశ్చయమ్మురా`. మరి ఈ చిత్రం శ్రీనివాస్‌రెడ్డికి ఎలాంటి గుర్తింపు నిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments