'టిక్ టిక్ టిక్' టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
జయం రవి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో పద్మావతి చదలవాడ నిర్మాతగా వస్తోన్న చిత్రం 'టిక్ టిక్ టిక్'. ఇండియన్ సినిమా చరిత్రంలో తొలి అంతరిక్ష సినిమాగా ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఈ సినిమా టీజర్‌ను యంగ్ హీరో అడివిశేష్ విడుదల చేశారు. సినిమా త్వరలోనే తెలుగు, తమిళంలో గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. ఈ టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్బంగా....
హీరో అడివిశేష్ మాట్లాడుతూ - "ఇండియన్ సినిమాలో తొలి స్పేస్ మూవీ `టిక్ టిక్ టిక్`. నాకు ఇష్టమైన హీరో జయం రవిగారు ఈ సినిమాలో హీరోగా నటించారు. లక్ష్మణ్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. టీజర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీ 'గ్రావిటీ'ని తలపిస్తుంది. ఇండియన్ స్క్రీన్‌ఫై ఇలాంటి సినిమా రావడం చాలా గొప్ప విషయం. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుంది. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్" అన్నారు.
లక్ష్మణ్ మాట్లాడుతూ - "మా బ్యానర్‌లో విడుదలైన 'బిచ్చగాడు' సినిమాను అందరూ ఆదరించారు. తర్వాత '16' సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు మరో విభిన్నమైన చిత్రం 'టిక్ టిక్ టిక్' ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు టీజర్‌ను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.
ఇది మంచి టెక్నికల్ చిత్రమే కాదు. సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది. తొలి ఇండియన్ స్పేస్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మేం అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇలాంటి సినిమా చేయడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ సినిమా వి.ఎఫ్.ఎక్స్ చేయడం చాలా కష్టం. కానీ టెక్నిషియన్స్ అద్భుతంగా పనిచేసి అద్భుతమైన అవుట్‌పుట్‌ను తీసుకొచ్చారు.జయం రవి, నివేదా పేతురాజ్‌లు తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న నటులే. అద్భుతంగా నటించారు. ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు.త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం" అన్నారు.
జయం రవి, నివేదా పేతురాజ్, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, పాటలు : వెన్నెలకంటి, రాకేందు మౌళి, మాటలు : రాజేష్ ఎ.మూర్తి, కెమెరా : వెంకటేష్, ఎడిటర్: ప్రదీప్, ఆర్ట్: మూర్తి, నిర్మాత : పద్మావతి చదలవాడ, దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments